- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Survey : జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న సర్వే
దిశ, ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ,కులాలను గుర్తించేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈనెల 1వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలను సందర్శించి ప్రతి ఇంటికి సర్వే స్టిక్కర్లను అతికించినా విషయం అందరికీ తెలిసిందే. ఏ ఒక్క ఇంటిని తప్పిపోకుండా గుర్తించి పరిశీలించి స్టిక్కర్ అతికించడానికి స్వయంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులతో వెళ్లి పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు కూడా జారీ చేశారు. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 6 నుంచి పూర్తిస్థాయిలో ఈ ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం 473 గ్రామ పంచాయితీలలో ఈ సర్వేను నిర్వహించనున్నారు.
ఈ పంచాయతీల పరిధిలో సర్వే నిర్వహించేందుకు ఇప్పటికే ఇంటింటికి స్టిక్కర్లు అంటించిన ఆయా అధికారులు, ప్రత్యేక సిబ్బంది రూ. 1 లక్ష , 49వేల,161 ఇండ్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందుకోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ 1,612 మంది ఎన్యుమరేటర్లు, 173 మంది సూపర్ వైజర్లను నియమించి సిద్ధం చేశారు. వీరి ద్వారానే జిల్లాలో సర్వే నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా సైతం వెల్లడించారు. కాగా జిల్లాలోని 18 మండలాల్లో జరగనున్న ఈ ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేపై తన ఛాంబర్ నుంచి గూగుల్ మీట్ ద్వారా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే మున్సిపల్ పరిధిలోని 48,393 ఇళ్లలో 385 ఎన్యుమరేటర్లు, 41 సూపర్వైజర్లు సర్వే నిర్వహించనున్నారని తెలియజేశారు. ఈ సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.