- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Patancheru MLA : పర్యాటక కేంద్రాలుగా పటాన్ చెరు చెరువులు..
దిశ,పటాన్ చెరు : పటాన్ చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు, తిమ్మక్క చెరువు, ముత్తంగి గ్రామ పరిధిలోని ఎన్నం చెరువులను రూ.28.36 కోట్లతో పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ చెరువుల విభాగం ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి తిమ్మక్క చెరువు, సాకి చెరువు, ఎన్నం చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్ చెరు డివిజన్ పరిధిలో చెరువులను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో డివిజన్ పరిధిలోని ప్రధాన చెరువులైన తిమ్మక్క చెరువు ను ఏపిఆర్ గ్రూప్ సౌజన్యంతో రూ. 3.46 కోట్ల తో, సాకి చెరువును ఇంకార్ గ్రూప్ సౌజన్యంతోరూ. 8 కోట్ల ౌతో, ముత్తంగి ఎన్నం చెరువును హెచ్ఎండీఏ ద్వారా రూ.ఆరు కోట్ల 90 లక్షలతో అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు.
సాకి చెరువు కట్ట పైన జీహెచ్ఎంసీ చెరువుల విభాగం ద్వారారూ. 10 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించ బోతున్నట్లు తెలిపారు. ప్రతి చెరువు కట్ట పైన సెంట్రల్ లైటింగ్ సిస్టం, గ్రీనరీ, వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునేందుకు పార్క్, తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అతి త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, హెచ్ఎండీఏ చెరువుల విభాగం డి ఈ రామారావు, జిహెచ్ఎంసి చెరువుల విభాగం డి ఈ నళిని, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, ముత్తంగి మాజీ సర్పంచ్ ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.