- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
JEE Main Result: జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుదల

దిశ, వెబ్ డెస్క్: బీటెక్, బీఈ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్ష సెషన్-2 ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ(NTA) గురువారం విడుదల చేయనుంది. అలాగే, సెషన్-1, సెషన్-2 పరీక్షల్లో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను కేటాయించనుంది. సెషన్-1 పరీక్షలు జనవరిలో ముగియగా.. ఫిబ్రవరిలో ఫలితాలను వెల్లడించింది. సెషన్-2 పరీక్షలు ఈనెల 9తో ముగిశాయి. ఈ నేపథ్యంలో NTA ఇప్పటికే ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ 'కీ'పై అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించి తుది 'కీ'తోపాటు ర్యాంకులను వెల్లడించనుంది. ఇక జేఈఈ మెయిన్ రెండు సెషన్లలో బెస్ట్ స్కోర్ చేసిన తొలి 2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధిస్తారు. మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుంది.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
* జేఈఈ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ను ఓపెన్ చేయాలి.
* జేఈఈ మెయిన్స్ ఫలితాలు 2025 లింక్‌పై క్లిక్ చేయాలి.
* అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను (అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్) నమోదు చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
* సబ్మిట్‌పై క్లిక్ చేస్తే ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.
* ఫలితాన్ని తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.