- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Stock Market: లాభాల నుంచి మళ్లీ నష్టాల బాటపట్టిన స్టాక్ మార్కెట్లు
దిశ, వెబ్‌డెస్క్:భారతీయ స్టాక్ మార్కెట్లు(Indian Stock Markets) బుధవారం మళ్లీ నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభం కాగా చివరకి అమ్మకాలతో ఒత్తిడికి గురై నష్టాల్లోకి పయనించాయి.మూడు రోజుల పాటు జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ(Monetary Policy Committee) సమీక్ష సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్(RBI Governer Shaktikanta Das) వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లుగా ప్రకటించడంతో మార్కెట్లు తొలుత లాభాల్లో ట్రేడ్ అవ్వగా ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో 82,319.21 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్(Sensex) అత్యల్పంగా 81,342.89 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరుకుంది. చివరకు 167 పాయింట్ల నష్టంతో 81,467.10 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) 0.12 శాతం నష్టంతో 25 వేల పాయింట్ల దిగువన 24,981 పాయింట్ల వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 77.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.96గా ఉంది.
లాభాలో ముగిసిన షేర్లు : టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్
నష్టపోయిన షేర్లు : రిలయన్స్, ఐటీసీ, నెస్లే ఇండియా, హిందూస్తాన్ యూనిలీవర్, ఎల్అం డ్ టీ