Skoda Auto: రూ. 7.89 లక్షల ధరలో కొత్త ఎస్‌యూవీ కైలాక్‌ను విడుదల చేసిన స్కోడా

by S Gopi |   ( Updated:2024-11-06 15:50:24.0  )
Skoda Auto: రూ. 7.89 లక్షల ధరలో కొత్త ఎస్‌యూవీ కైలాక్‌ను విడుదల చేసిన స్కోడా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో తన కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కైలాక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ. 7.89 లక్షల ప్రారంభ ధరతో తీసుకొచ్చిన ఈ కారు కోసం డిసెంబర్ 2వ తేదీని నుంచి బుక్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి మూడో వారం నుంచి డెలివరీలు అందించనున్నట్టు తెలిపింది. అత్యాధునిక ఫీచర్లతో ప్రస్తుతం వాహన మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో కైలాక్ గట్టి పోటీ ఇస్తుందని కంపెనీ అభిప్రాయపడింది. కీలెస్ ఎంట్రీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి సౌకర్యాలతో పాటు ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 3-పాయింట్ సీట్ బెల్ట్ వంటి భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వెనుకవైపు ఏసీ వెంట్‌లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సన్‌రూఫ్ కూడా ఉన్నాయని కంపెనీ వివరించింది. స్కోడా కైలాక్ మోడల్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యూండాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మారుతీ సుజుకి బ్రెజా, మహీంద్రా 3ఎక్స్ఓ, కియా సోనెట్‌కు పోటీ ఇవ్వనుంది.

Advertisement

Next Story

Most Viewed