ఆర్థిక అనిశ్చితి వల్ల మెజారిటీ కుటుంబాల్లో తగ్గిన ఆదాయం, పొదుపు!

by Hajipasha |   ( Updated:2023-01-30 02:25:07.0  )
ఆర్థిక అనిశ్చితి వల్ల మెజారిటీ కుటుంబాల్లో తగ్గిన ఆదాయం, పొదుపు!
X

న్యూఢిల్లీ: అధిక ద్రవ్యోల్బణం, అన్ని రకాల ఖర్చులు పెరిగిపోవడం వంటి పరిణామాల మధ్య దేశంలోని చాలా కుటుంబాలు 25 శాతం మేర తమ ఆదాయం క్షీణించిందని చెబుతున్నారు. పొదుపు కూడా తగ్గిపోయిందంటున్నారు. ఉద్యోగాలు కోల్పోవడం, నియామకాలు నెమ్మదించిన కారణంగా తమ ఆర్థిక పరిస్థితులు మరో 6-12 నెలల పాటు ప్రతికూలంగా ఉండొచ్చని 52 శాతం మంది భావిస్తున్నారు. ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ ఆదివారం విడుదల చేసిన తన సర్వేలో పలు విషయాలను వెల్లడయ్యాయి.

దేశవ్యాప్తంగా 309 జిల్లాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా, దేశంలోని మెజారిటీ కుటుంబాలు తమ ఆదాయంలో క్షీణతను ఎదుర్కొంటున్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో సగానికి పైగా కుటుంబాలు రాబడి తగ్గిందని చెప్పారు. ఈ నేపథ్యంలో రానున్న 2023-24 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రేట్లను తగ్గించడం, మినహాయింపులు పెంచడం గురించి అవసరమైన చర్యలు ఉండాలని చెబుతున్నారు. టైర్1, టైర్2 పట్టణాల నుంచి లోకల్ సర్కిల్స్ ఈ వివరాలను సేకరించగా, 56 శాతం మంది పొదుపు తగ్గిపోతోందని చెప్పారు. 19 శాతం మాత్రమే పొదుపు పెరగవచ్చని భావిస్తున్నారు.

Advertisement

Next Story