OpenAI బోర్డు‌లోకి తిరిగి వస్తున్న సామ్ ఆల్ట్‌మాన్

by Harish |
OpenAI బోర్డు‌లోకి తిరిగి వస్తున్న సామ్ ఆల్ట్‌మాన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాప్ చాట్‌జీపీటీ సంస్థ OpenAI బోర్డు‌లోకి సామ్ ఆల్ట్‌మాన్ తిరిగి రానున్నారు. గత సంవత్సరం కంపెనీని నడిపించే ఆల్ట్‌మాన్ సామర్థ్యాలపై ఇకపై తమకు నమ్మకం లేదని బోర్డు ఆయన్ను తొలగించింది, ఆ వెంటనే అధ్యక్షడు గ్రెగ్ బ్రాక్‌మన్ కూడా తన పదవి నుంచి వైదొలిగారు. ఆల్ట్‌మన్ బోర్డుతో ఏ విషయాలను పంచుకోడని, మెంబర్స్ తీసుకునే నిర్ణయాలను అతను అడ్డుకుంటారని బోర్డు ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఆయన తొలగింపుపై స్వతంత్ర దర్యాప్తును ఏర్పాటు చేయగా, తాజాగా OpenAI బోర్డు ప్రత్యేక కమిటీ సమీక్షను పూర్తి చేసినట్లు ప్రకటించింది.

బోర్డు సభ్యులను, ఉద్యోగులను ఇంటర్వ్యూ చేసి, 30,000 కంటే ఎక్కువ పత్రాలను సమీక్షించి ఆల్ట్‌మాన్, గ్రెగ్ బ్రాక్‌మాన్ నాయకత్వంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఆల్ట్‌మన్ తిరిగి సీఈఓగా బోర్డులో చేరతారని OpenAI బోర్డ్ చైర్ బ్రెట్ టేలర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బోర్డు విస్తరణలో భాగంగా ముగ్గురు కొత్త బోర్డు సభ్యుల ఎన్నికను కూడా ప్రకటించారు. వారి అనుభవం, అనుభవం కంపెనీ వృద్ధికి ఉపయోగపడుతుందని, మానవాళి అందరికీ కృత్రిమ మేధస్సు ప్రయోజనాలను నిర్ధారించే మా లక్ష్యాన్ని కొనసాగిస్తామని టేలర్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed