Digital Rupee : డిజిటల్ రూపాయి చెల్లింపులను ప్రారంభించిన రిలయన్స్ రిటైల్

by samatah |   ( Updated:2023-02-04 09:17:31.0  )
Digital Rupee : డిజిటల్ రూపాయి చెల్లింపులను ప్రారంభించిన రిలయన్స్ రిటైల్
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద రిటైల్ సంస్థ రిలయన్స్ రిటైల్ తన స్టోర్లలో ఆర్‌బీఐ డిజిటల్ రూపాయిలో లావాదేవీలను ప్రారంభించింది. దీంతో డిజిటల్ రూపాయిని అంగీకరించిన దేశీయ మొట్టమొదటి రిటైల్ చెయిన్‌గా రిలయన్స్ రిటైల్ నిలిచింది. దీనికోసం కంపెనీ ఇన్నొవిటీ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మొదటగా డిజిటల్ రూపీని కంపెనీకి చెందిన ఫ్రెష్‌పిక్ స్టోర్లలో ప్రారంభించామని, రానున్న రోజుల్లో మిగిలిన రిలయన్స్ రిటైల్ స్టోర్లకు విస్తరించనున్నట్టు గురువారం ప్రకటనలో తెలిపింది.

వినియోగదారులు ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంకుల నుంచి తీసుకునే డిజిటల్ రూపాయి యాప్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, ఈ-రూపీ ద్వారా చెల్లింపులు చేయవచ్చని, వారు చెల్లింపులు పూర్తి చేసిన తర్వాత తక్షణమే నోటిఫికేషన్ వస్తుందని కంపెనీ వివరించింది. తమ స్టోర్లలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించడం ద్వారా వినియోగదారులకు వీలైనన ఎక్కువ చెల్లింపు విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చామని రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ వి సుబ్రమణ్యం చెప్పారు. అలాగే, కంపెనీ మొదటిసారిగా డైనమిక్ క్యూఆర్-ఆధారిత ఇన్-స్టోర్ యూపీఐ చెల్లింపులను ప్రారంభించింది. వినియోగదార్లు సులభమైన, ఇబ్బందుల్లేని చెల్లింపులు చేసేందుకు దీన్ని మొదలుపెట్టినట్టు ఆయన వెల్లడించారు.

ఇవి కూడా చదవండి : ఆదాయం ఎంత దాటితే ఎంత ట్యాక్స్ చెల్లించాలి...? కన్‌ఫ్యూజ్ లేకుండా పూర్తి డీటెయిల్స్

Advertisement

Next Story

Most Viewed