Rapido: ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి ర్యాపిడో!.. జొమాటో, స్విగ్గీల ఆధిపత్యానికి చెక్?

by Prasad Jukanti |   ( Updated:2025-03-12 07:38:26.0  )
Rapido: ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి ర్యాపిడో!.. జొమాటో, స్విగ్గీల ఆధిపత్యానికి చెక్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: బైక్ టాక్సీ ప్లాట్‌ఫామ్‌ ర్యాపిడో (Rapido) మరో కొత్త వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. ప్రస్తుతం రైడ్ లు మాత్రమే చేస్తున్న ర్యాపిడో యాప్ తన వ్యాపార విస్తరణలో భాగంగా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ (Online Food Delivery) రంగంలోకి అడుగుపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ర్యాపిడో సంస్థ ప్రతినిధులు ఇటీవల పలు రెస్టారెంట్ల నిర్వాహకులతో భేటీ అయి ఈ విషయంలో సంప్రదింపులు సైతం జరిపినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ పై జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) ఫ్లాట్ ఫామ్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వీటి కమిషన్ స్ట్రక్చర్ ను సవాల్ చేసే లక్ష్యంతో ర్యాపిడో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2015 లో బైక్ ట్యాక్సీ ప్లాట్ ఫామ్ గా తన కార్యకలాపాలను ప్రారంభించిన ర్యాపిడో ఒక దశాబ్ద కాలంలోనే దేశంలోనే రైడ్ షేరింగ్ స్పేస్ లో రెండవ స్థానాన్ని ఆక్రమించుకుంది. సంస్థ తదుపరి వృద్ధి ప్లాన్ లో భాగంగా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Read More..

Todays Gold Rate ( March - 12) : బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ ధరలు

Next Story

Most Viewed