యాపిల్‌ను అధిగమించబోతున్న Nvidia

by Harish |
యాపిల్‌ను అధిగమించబోతున్న Nvidia
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ సెమీకండక్టర్ చిప్‌ల తయారీ కంపెనీ ఎన్విడియా(Nvidia) ప్రపంచంలోనే రెండవ అత్యంత విలువైన కంపెనీగా యాపిల్‌ను అధిగమించడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం Nvidia మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.38 ట్రిలియన్ డాలర్లను కలిగి ఉంది. ఇది యాపిల్ కంటే 230 బిలియన్ డాలర్లు, మైక్రోసాఫ్ట్ కంటే 645 బిలియన్ డాలర్లు వెనుకబడి ఉంది. చాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధస్సు ఉత్పత్తుల్లో హై-ఎండ్ AI చిప్ మార్కెట్‌లో Nvidia 80 శాతం వాటాను కలిగి ఉంది. కేవలం తొమ్మిది నెలల్లో దీని మార్కెట్ $1 ట్రిలియన్ నుండి $2 ట్రిలియన్ల కంటే ఎక్కువ పెరిగింది. ఇది అమెజాన్, ఆల్ఫాబెట్, సౌదీ అరామ్‌కోలను అధిగమించింది.

AI- సంబంధిత ఉత్పత్తుల ద్వారా ఈ సంవత్సరం Nvidia 95 శాతం పెరుగుదలను చూసింది. ఐఫోన్ విక్రయాలు తగ్గటం ద్వారా యాపిల్‌ను దాటి మైక్రోసాఫ్ట్‌ అత్యంత విలువైన కంపెనీగా అవతరించగా, తాజాగా సెమీకండక్టర్ కంపెనీ యాపిల్‌ను అధిగమించడానికి వేగంగా వృద్ధి చెందుతుంది. Nvidia స్టాక్ ఇటీవలి వారాల్లో ఎక్కువగా పెరిగి టెస్లా స్థానాన్ని భర్తీ చేసింది. బలమైన పనితీరు కారణంగా Nvidia స్టాక్ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది.

Advertisement

Next Story

Most Viewed