Netflix యూజర్లకు షాక్.. పాస్‌వర్డ్ షేరింగ్ విషయంలో యూటర్న్!

by Hajipasha |   ( Updated:2022-12-22 13:29:28.0  )
Netflix యూజర్లకు షాక్.. పాస్‌వర్డ్ షేరింగ్ విషయంలో యూటర్న్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాకు ఇవ్వనుంది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ పాస్‌వర్డ్ షేరింగ్ విధానంపై కీలక నిర్ణయం తీసుకోనుంది. వచ్చే ఏడాది నుంచి నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ పాస్‌వర్డ్‌‌ షేరు చేయకుండా సన్నాహాలు చేస్తున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అయితే నెట్‌ఫ్లిక్స్ ఆదాయం 2022 ప్రారంభంలో పడిపోయిన తర్వాత పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేయాల్సిన అవసరం ఉందని, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ 10ఏళ్లలో మొదటిసారిగా సబ్‌స్ర్కైబర్లను కోల్పోయిందని గుర్తించింది. అంతేకాక ఇప్పుడు అతి త్వరలో రియాలిటీ కాబోతోందని, వచ్చే ఏడాది నుంచి నెట్‌ఫ్లిక్స్ యూజర్లు ఇతరులకు పాస్‌వర్డ్‌లను షేర్ చేయడానికి అనుమతించదని వెల్లడించింది.

Advertisement

Next Story