- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tax Collections: రూ. 11 లక్షల కోట్లు దాటిన నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు
దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది అక్టోబర్ 11 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 18.35 శాతం పెరిగి రూ. 11.25 లక్షల కోట్లకు చేరుకున్నాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. మొత్తం వసూళ్లలో కార్పొరేట్ పన్నులు రూ. 4.94 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్నులు రూ. 5.98 లక్షల కోట్లు ఉన్నాయని ఆదాయపు పన్ను విభాగం శుక్రవారం తెలిపింది. సమీక్షించిన సమయానికి స్థూలంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 22.30 శాతం వృద్ధితో రూ. 13.57 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో రూ. 6.11 లక్షల కోట్లు కార్పొరేట్ పన్నులు కాగా, రూ. 7.13 లక్షల కోట్ల వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు ఉన్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం రూ. 2.31 లక్షల కోట్ల విలువైన రీఫండ్లు జారీ చేసింది. ఇది గతేడాది కంటే 46 శాతం పెరిగింది. అందులో కార్పొరేట్ పన్ను రీఫండ్లు రూ. 1.16 లక్షల కోట్లు కాగా, వ్యక్తిగత ఆదాయ పన్ను రీఫండ్లు రూ. 1.14 లక్షల కోట్లు ఉన్నాయి. ఇక, 2023-24 ఆర్థిక సంవత్సరంలో నికర వసూళ్లు రూ. 9.51 లక్షల కోట్లు వసూలు కాగా, రూ. 11.09 లక్షల కోట్ల వసూళ్లు జరిగాయి.