Amazon: అమెజాన్‌కు ఎదురుదెబ్బ!

by Manoj |   ( Updated:2022-06-13 10:41:05.0  )
NCLAT Rejects Amazons Plea Against CCI Order, Asks Firm To Deposits 200 cr In 45 days
X

న్యూఢిల్లీ: NCLAT Rejects Amazon's Plea Against CCI Order, Asks Firm To Deposits 200 cr In 45 days| ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యూచర్ గ్రూప్‌తో కొనసాగుతున్న వివాదానికి సంబంధించి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్ వేసిన పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(NCLAT) కోట్టివేస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా 45 రోజుల్లోగా రూ. 202 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇరు సంస్థల మధ్య ఒప్పందానికి సంబంధించి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా ఇతర విషయాలను దాచి ఉంచినందుకు అమెజాన్‌కు సీసీఐ విధించిన రూ. 202 కోట్ల జరిమానాను నిర్దేశించిన గడువులోగా చెల్లించాలని స్పష్టం చేసింది.

ఈ మేరకు జస్టిస్ ఎం వేణుగోపాల్, జస్టిస్ అశోక్ కుమార్ మిశ్రాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సీసీఐ ఉత్తర్వులను సమర్థించింది. కాగా, అమెజాన్, ఫ్యూచర్ కూపన్ కంపెనీల మధ్య 2019లో జరిగిన ఒప్పందం ఆధారంగా ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ మధ్య ఒప్పందాన్ని అమెజాన్ వ్యతిరేకిస్తూ వస్తోంది. కానీ, గతేడాది డిసెంబర్ 17న సీసీఐ అమెజాన్-ఫ్యూచర్ కూపన్‌ల మధ్య ఒప్పందాన్ని రద్దు చేసింది. తమ వద్ద అనుమతులు తీసుకునే ముందు అమెజాన్ అవసరమైన సమాచారాన్ని కావాలనే దాచిపెట్టిందని, అందుకే ఒప్పందాన్ని రద్దు చేస్తూనే రూ. 202 కోట్ల జరిమానాను విధిస్తున్నట్టు సీసీఐ పేర్కొంది. దీని తర్వాత అమెజాన్ సంస్థ సీసీఐ తీర్పును సవాలు చేస్తూ ఈ ఏడాది ప్రారంభంలో సుప్రీంకోర్టుకెళ్లింది. కానీ, ఈ వ్యవహారాన్ని ఇరు సంస్థలూ ఎన్‌సీఎల్‌టీ వద్ద తేల్చుకోవాలని సూచించింది. ఇప్పుడు ఎన్‌సీఎల్‌టీ నుంచి కూడా అమెజాన్‌కు చుక్కెదురైంది.

Advertisement

Next Story

Most Viewed