- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టెస్లా రోబోటాక్సీ విడుదల తేదీని ప్రకటించిన మస్క్
దిశ, బిజినెస్ బ్యూరో: టెస్లా అధినేత ఎలాన్‌మస్క్ శనివారం కీలక ప్రకటన చేశారు. టెస్లా రోబోటాక్సీ విడుదల తేదీని ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో దీన్ని అందుబాటులోకి తీసుకువస్తామని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దీనిని 2019లో తొలిసారిగా ప్రకటించారు. ఓనర్‌లు తమ టెస్లా కార్లు ఉపయోగంలో లేనప్పుడు అద్దెకు ఇవ్వడానికి అనుమతించడం ద్వారా కొంత డబ్బును సంపాదించే అవకాశం ఉంటుంది. దీనిలో కంపెనీ కూడా కొంత కమిషన్ తీసుకుంటుంది.
రోబోటాక్సీ సేవలు మార్కెట్లోకి రావడానికి చాలా అవంతరాలు ఎదుర్కొంది. దీనిని విడుదల చేయడానికి ప్రధాన అడ్డంకి, టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీకి రెగ్యులేటరీ ఆమోదం పొందడం. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (FSD) బీటా సాఫ్ట్‌వేర్‌తో సమస్యలను కనుగొన్నందున గత సంవత్సరం, టెస్లా అనేక వాహనాలను రీకాల్ చేయాల్సి వచ్చింది. దీంతో రోబోటాక్సీ లాంచ్ తేదీని పొడిగించాల్సి వచ్చింది. టెస్లా కార్లలో కనుగొన్న లోపం కారణంగా అవి వేగ పరిమితులను ఉల్లంఘిస్తాయని రెగ్యులేటరీ హెచ్చరించింది. దీంతో ఈ సమస్య పరిష్కారానికి కంపెనీ తన కార్లను తిరిగి వెనక్కి పిలవాల్సి వచ్చింది.