- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Mahindra&Mahindra: నవంబర్ లో 12 శాతం పెరిగిన మహీంద్రా అమ్మకాలు..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా(M&M) నవంబర్ నెలకు సంబంధించి వాహనాల విక్రయాల(Vehicles Sales) సంఖ్యను ప్రకటించింది. గత నెలలో నేషనల్(National), ఇంటర్నేషనల్(International) కలిపి వెహికల్ అమ్మకాల సంఖ్య 12 శాతం పెరిగాయి. దీంతో నవంబర్ లో మొత్తం వాహనాల విక్రయాల సంఖ్య 79,083కు చేరుకున్నాయి. కాగా గతేడాది ఇదే సమయంలో 70,576 వెహికల్స్ అమ్ముడుపోయాయని కంపెనీ తెలిపింది. సంస్థ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(SUV) విభాగంలో అత్యధికంగా 46,222 వాహనాలను విక్రయించింది. గతేడాది సేల్ అయిన 39,981 SUV వాహనాలతో పోలిస్తే ఈ సంవత్సరం నవంబర్ లో 16 శాతం లాభాలు సాధించామని మహీంద్రా అండ్ మహీంద్రా ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే గత నెలలో ఎగుమతులతో కలిపి 33,378 యూనిట్ల ట్రాక్టర్(Tractor) విక్రయాలు జరిగాయని, పోయిన ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 32,074 యూనిట్లుగా ఉందని కంపెనీ వెల్లడించింది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ తో ముగిసిన రెండో త్రైమాసికం(Q2FY25)లో సంస్థ నికర లాభాలు 35 శాతం పెరిగి రూ. 3,171 కోట్లకు చేరుకున్న విషయం తెలిసిందే.