LIC Mutual Funds: LIC కీలక నిర్ణయం..ఇక రోజుకు రూ.100 పెట్టుబడితో సరికొత్త స్కీం..!

by Maddikunta Saikiran |
LIC Mutual Funds: LIC కీలక నిర్ణయం..ఇక రోజుకు రూ.100 పెట్టుబడితో సరికొత్త స్కీం..!
X

దిశ, వెబ్‌డెస్క్:భారతదేశం(India)లోని ప్రజల్లో పెరుగుతున్న ఆర్థిక అక్షరాస్యత(Financial literacy)తో మ్యూచువల్ ఫండ్స్‌(Mutual Funds)లో పెట్టుబడి(Investment) పెడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి భారీగా పెరుగిపోతోంది.ఈ క్రమంలో చిన్న‌మొత్తంలో పెట్టుబ‌డి(Invest in small amounts) పెట్టేవారిని ప్రోత్స‌హించేలా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి రోజుకు రూ.300 కాకుండా రూ.100తో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తామని ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్(LIC MF) ఎండీ రవి కుమార్ ఝా(MD Ravi Kumar Jha) ఓ సమావేశంలో తెలిపారు.అలాగే నెల‌కు రూ.వెయ్యి పెట్టుబడికి బదులుగా రూ.250లకు తగ్గిస్తామని రవి కుమార్ పేర్కొన్నారు.అలాగే మూణ్నెళ్లకు రూ.3 వేల‌కు బ‌దులుగా రూ.750 వ‌ర‌కు పెట్టుబడి పెట్ట‌వ‌చ్చని, ఈ కొత్త మార్పులు వచ్చే నెల అక్టోబర్ మొదటివారంలోగా అమలులోకి తీసుకొస్తామని తెలిపారు.చిరు వ్యాపారులు(Small Traders),కూరగాయలు అమ్మేవారు(Vegetable Sellers),దుకాణదారులూ(Shopkeepers) స్టాక్ మార్కెట్ల(Stock Markets)లో పెట్టుబడులు పెట్టేందుకు ఇది అవకాశం కల్పిస్తుందన్నారు.చిన్న‌మొత్తంలో పెట్టుబ‌డి పెట్టేవారిని ప్రోత్స‌హించేలా మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో మైక్రో-SIPల‌ను అందుబాటులోకి తీసుకొస్తామని సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్స్ ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed