- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kiran Mazumdar-Shaw: బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజందార్-షాకు జెంషెడ్ జీ టాటా అవార్డు
దిశ, వెబ్‌డెస్క్: బయోకాన్(Biocon) గ్రూప్ చైర్ పర్సన్ కిరణ్ మజందార్-షా(Kiran Mazumdar-Shaw)కు ప్రతిష్ఠాత్మక 'జెంషెడ్ జీ టాటా(Jamshedji Tata)' అవార్డు లభించింది. ప్రపంచవ్యాప్తంగా బయోసైన్సెస్(Biosciences) ప్రగతికి ఆమె చేసిన విశేషమైన కృషిని గుర్తిస్తూ ఇండియన్ సొసైటీ ఫర్ క్వాలిటీ(ISQ) ఈ అవార్డ్ ప్రకటించింది. ఐఎస్ క్యూ డైరెక్టర్ జనక్ కుమార్ మెహతా(Janak Kumar Mehta) చేతుల మీదుగా మజుందార్-షా ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జెంషెడ్ జీ టాటా అవార్డు అందుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఈ అవార్డు నాకు చాలా ప్రత్యేకమైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాటా స్టీల్ మాజీ వైస్ చైర్మన్ ముత్తురామన్(Muthuraman), ISQ ప్రెసిడెంట్ డాక్టర్ కేఎన్ సుబ్రమణ్య(KN Subramanya) పాల్గొన్నారు. కాగా 2004లో ఐఎస్ క్యూ ఈ అవార్డు ఇవ్వడం ప్రారంభించింది. దేశానికి సేవలు అందించిన ప్రముఖ వ్యాపారులను గుర్తించి ISQ ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. కాగా కిరణ్ మజందార్ షా దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరు. ఫోర్బ్స్(Forbes) ప్రకారం ఆమె నికర ఆస్తి రూ. 29,050 కోట్లుగా ఉంది. భారత్(India)లోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో కిరణ్ మజందార్-షా 91వ స్థానంలో ఉన్నారు.