CM Chandrababu: పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు..! సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే

by Shiva |   ( Updated:2024-12-15 08:35:29.0  )
CM Chandrababu: పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు..! సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర విభజన తరువాత వరుసగా తెలంగాణ (Telangana)లో వివిధ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వవిద్యాలయాల పేర్లు మారుతున్నాయి. తాజాగా, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప‌రెడ్డి (Suravaram Prathapa Reddy) పేరు పెడతామని ప్రకటించారు. అయితే, రేవంత్ చేసిన కామెంట్స్‌పై సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పందించారు. ఇవాళ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. హైద్రాబాద్‌ (Hyderabad)లో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టిన పొట్టి శ్రీరాములు (Potti Sriramulu) పేరును మార్చే పరిస్థితి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు.

త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్సిటీ (Telugu University)ని కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ తరువాతే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిందని గుర్తు చేశారు. ఆ తదనంతర పరిణామాలతో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. అదేవిధంగా పొట్టి శ్రీరాములు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, ఆయన ఉన్న ఇంటిని మెమోరియల్‌గా మారుస్తామని అన్నారు.

Advertisement
Next Story