- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Viral video: ఆకాశంలో అద్భుతం.. రాత్రిని పగలుగా మార్చిన తోక చుక్క

దిశ, వెబ్ డెస్క్: అంతరిక్షంలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. సూర్యుడు, చంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, ఉల్కాలు.. అన్నీ విశ్వంలో భాగమే. అందులో కొన్ని మనకు అప్పుడప్పుడు ఆకాశంలో ఆవిషృతమవుతుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో అలాంటి ఓ అద్భుతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మిలా మిలా మెరిసే నీలి రంగులోని ఓ భారీ తొక చుక్క (Meteor) ఆకాశం నుంచి భూమిపై రాలిపడింది. అది రాలుతున్న సమయంలో వచ్చిన వెలుగు చిమ్మ చీకటిగా ఉన్న రాత్రిని ఒక్కసారిగా పగులుగా మారిపోయింది. ఈ ఘటన పోర్చుగల్‌లో ఆవిషృతమైంది.
ఓ అమ్మాయి ఇంటి ముందు కూర్చుని సెల్పీ వీడియో రికార్డు చేసుకుంటుంది. ఆకాశంలో ఒక్కసారిగా వెలుతురు రావటంతో ఆ అమ్మాయి పైకి చూసింది. ఓ భారీ తోక చుక్క ఆకాశంలో తన మీది నుంచి వెళ్లింది. ఆ సమయంలో వచ్చిన వెలుగు ఒక్కసారిగా పగలును తలపించింది. ఇది క్యాస్ట్రో డైరో ప్రాంతంలో పడినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో గత ఏడాది మేలో ఆవిషృతమైన అద్భుతానికి సంబంధించినదిగా తెలుస్తోంది. తోక చుక్క నేలరాలి ఏడాది పూర్తైన సందర్భంగా నాటి వీడియోలను నెటిజన్లు మరోసారి షేర్ చేయగా వైరల్‌గా మారాయి. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్.. అద్భుతమైన వీడియో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అలాగే, సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలలో తోకచుక్క నుంచి అవశేషాలు రాలిపడుతుంటాయి. ప్రతి ఏడాదిలో రెండుసార్లు ఈ తోకచుక్క అవశేషాలు కనిపిస్తాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 25 నుంచి 30 మధ్య ఈ అద్భుత అరుదైన దృశ్యం కనిపించనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంచుమించు 1 గంట పాటు ఆకాశంలో దాదాపు 10 నుంచి 20 ఉల్కలు కన్పించనున్నాయి. అయితే ఈసారి కనువిందు చేయనున్న లైరిడ్ ఉల్కాపాతం (Lyrid Meteor Shower) అంత ప్రకాశవంతమైనది కాదు.
అసలు ఉల్క అంటే ఏంటి?
మన సౌర వ్యవస్థలోని గ్రహాల మధ్య ఖాళీలో లెక్కలేనన్ని చిన్న రాతి లేదా ఇనుప కణాలు ఉంటాయి. ఇవి గ్రహాల మాదిరిగానే సూర్యుని చుట్టూ తిరుగుతాయి. వాటి నుంచి వెలువడే కణాలు అంతరిక్షంలో తిరుగుతాయి. భూమి తన వార్షిక చలనం (Annual Motion)లో తోక చుక్క మార్గం గుండా వెళ్తున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి ద్వారా వేగవంతమై వాతావరణ ఘర్షణ కారణంగా రాత్రిపూట కొద్దిసేపు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. దీన్నే ఉల్కాపాతంగా చెబుతుంటారు.