- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కూతురి ప్రేమ వివాహం నచ్చని తండ్రి.. చివరికి ఏం చేశాడంటే?

దిశ,చిత్తూరు: తండ్రంటే పిల్లలను కంటికి రెప్పలా చూసుకునే వ్యక్తి. వాళ్లకు ఏ కష్టం రాకుండా అడ్డుగోడలా నిలబడతాడు. కానీ ఓ తండ్రి తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందని రాక్షసుడిగా మారాడు. నమ్మించి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. భార్య ఫిర్యాదుతో వెలుగు చూసిన ఈ ఘటన చిత్తూరు జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అసలేం జరిగింది..?
చిత్తూరు పట్టణం బాలాజీ నగర్‌కు చెందిన షౌకత్ అలీ కుమార్తె యాస్మిన్ ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. ఆ ప్రేమ వివాహం నచ్చని షౌకత్ అలీ తన కూతురిని చంపేయాలని పక్కా ప్లాన్ చేశాడు. దీని తన భార్య అక్క కొడుకైన మహమ్మద్ బాష అలియాస్ లాలు, మరో వ్యక్తి అబ్దుల్ సహాయం తీసుకున్నాడు. పధకం ప్రకారం ఈ నెల 13న యాస్మిన్‌కు ఫోన్ చేసి నీతో మాట్లాడాలి రా.. అంటూ చిత్తూరుకు రప్పించారు. అప్పటికే PCR కాలేజీ వద్ద అద్దెకు తీసుకున్న స్కార్పియో వాహనంలో రెడీగా ఉన్న తండ్రి ఆమెను దాంట్లో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్తానంటూ నమ్మబలికాడు. అక్కడి నుంచి దారి మళ్లించి మాపాక్షి క్రాస్ రోడ్డు, బాలాజీ హ్యాచరీస్ సమీపంలోని బీడు భూముల్లో వాహనం ఆపారు. వెంటనే వెంట తెచ్చుకున్న నూలు తాడును యాస్మిన్ గొంతుకు బిగించి హతమార్చారు. అనంతరం కూతురు శవాన్ని ఇంటికి తీసుకువచ్చిన షౌకత్ అలీ.. వరండాలో పడుకోబెట్టి ముగ్గురు పరారీ అయ్యారు.
యాస్మిన్ తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి..
ఇంటి వరండాలో కూతురు మృతదేహాన్ని చూసి తల్లి తల్లడిల్లిపోయింది. ఈ దారుణానికి పాల్పడింది తండ్రేనని గ్రహించి వెంటనే ఈ నెల 14న చిత్తూరు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్ డి.నెట్టికంటయ్య కేసు నమోదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన సీఐ.. వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్, ఎస్.ఐలు సుగుణ, బలరామయ్యలతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం నిందితులైన షౌకత్ అలీ, మహమ్మద్ బాష అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న అబ్దుల్ కలాం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన ఇన్స్పెక్టర్ నెట్టికంటయ్య, సీఐ మహేశ్వర్, ఎస్‌ఐలు సుగుణ, బలరామయ్య, క్రైమ్ పార్టీ సభ్యులు బాబు, తవ్వ రాజ్, రఫీ, వెంకటేష్ తదితరులను చిత్తూరు జిల్లా ఎస్.పి. అభినందించారు.