- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్యాకు 11 రెట్లు పెరిగిన భారత ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్ నుంచి రష్యాకు వస్తువుల ఎగుమతులు 11 రెట్లు పెరిగాయని గణాంకాలు వెల్లడించాయి. ఇంజనీరింగ్ ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ తాజా డేటా ప్రకారం, గత నెలలో మన దేశం నుంచి రష్యాకు జరిగిన ఎగుమతుల విలువ భారత కరెన్సీలో సుమారు రూ. 1,107 కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో ఇంజనీరింగ్ ఎగుమతులు రూ. 97 కోట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో యూఎస్, చైనా మార్కెట్లకు భారత ఎగుమతులు ప్రతికూలంగా ఉన్నాయి. అమెరికాకు ఇంజనీరింగ్ ఎగుమతుల విలువ 25 శాతం తగ్గాయి. చైనాకు 15.5 శాతం క్షీణించాయి. ఇక, రష్యా తర్వాత ఓమన్ దేశానికి భారత్ నుంచి ఇంజనీరింగ్ ఎగుమతులు రెండింతలు పెరిగి రూ. 1,276 కోట్లకు చేరుకుంది. మొత్తంగా భారత్ నుంచి ఇంజనీరింగ్ ఎగుమతులు ఈ ఏడాదిలో క్రమంగా తగ్గుతున్నాయి. ఏప్రిల్‌లో ఈ ఎగుమతులు 7.15 శాతం పడిపోయాయని ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ పేర్కొంది. రాగి, సంబంధిత ఉత్పత్తులు, బాయిలర్లు, పంపులు, వాల్వ్‌లు, ఎయిర్ కండిషనర్ మెషినరీ, ఆటో విడిభాగాలు, విద్యుత్ యంత్రాలు సానుకూల వృద్ధిని సాధించాయి. ఇనుము, ఉక్కు, ఉక్కు ఉత్పత్తులు, అల్యూమినియం, జింక్, నికెల్, సీసం, ద్విచక్ర వాహనాలు, ఆటో టైర్లు వంటిని ప్రతికూల వృద్ధిని చూశాయి.