జనవరి-మార్చిలో టెక్ స్టార్టప్‌లకు 75 శాతం తగ్గిన నిధులు!

by Harish |   ( Updated:2023-04-07 15:30:54.0  )
జనవరి-మార్చిలో టెక్ స్టార్టప్‌లకు 75 శాతం తగ్గిన నిధులు!
X

ముంబై: భారత టెక్ స్టార్టప్ కంపెనీలు నిధుల కొరత సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నియంత్రణ మార్పులు, నిధుల లభ్యత తగ్గడం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, పశ్చిమ దేశాల్లో నెలకొన్న మాంద్యం, సరఫరా ఆందోళనల కారణంగా పెట్టుబడిదారులు భారత వ్యాపారాలలో పెట్టుబడులకు దూరంగా ఉన్నారు.

మార్కెట్ పరిశోధనా సంస్థ ట్రాక్షన్ తాజా గణాంకాల ప్రకారం, 2023, మొదటి త్రైమాసికంలో టెక్ విభాగంలో మొత్తం రూ. 23 వేల కోట్ల విలువైన నిధులు వచ్చి చేరాయి. ఇది 2022 నాటితో పోలిస్తే 75 శాతానికి పైగా క్షీణించాయి. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల మధ్య ఖర్చు నియంత్రణ కలిగిన, బలమైన వ్యాపార వ్యూహం, లాభదాయకతపై దృష్టి సారించిన కంపెనీలకు మాత్రమే నిధులు వచ్చే వీలుందని ప్రముఖ వెంచర్ కేపిటల్ సంస్థ 35 నార్త్ వెంచర్స్ వ్యవస్థాపకుడు మిలన్ శర్మ తెలిపారు.

కంపెనీలు వ్యయాన్ని నియంత్రిస్తూ, సామర్థ్యాన్ని మెరుగుపరిచి, పెట్టుబడులను ఆకర్షించే విధంగా వినియోగదారు సంతృప్త వాతావరణాన్ని కలిగి ఉండాలని ఎజిలిటీ వెంచర్స్ సహ-వ్యవస్థాపకుడు ప్రశాంత్ నారంగ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed