- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత్-ఒమన్ మధ్య ముగిసిన వాణిజ్య చర్చలు.. ఎన్నికల తర్వాత సంతకాలు!
దిశ, బిజినెస్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలకు ముందు భారత్-ఒమన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు ముగిశాయని, ఎన్నికలు పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వంలో సంతకాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)గా పిలువబడే దీని ద్వారా రెండు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు సులభం కానున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, యంత్రాలు, ఇనుము, ఉక్కుపై సుంకాలను తొలగించడం ద్వారా పశ్చిమాసియా దేశానికి భారత్ తన ఎగుమతులను పెంచుతుంది. వ్యూహాత్మకంగా ఈ ఒప్పందం చాలా ముఖ్యమైనది.
గ్రీన్ ఎనర్జీ-సమర్థవంతమైన ఉత్పాదక పరంగా రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయి. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులను భారత్ నుంచి ఒమన్‌కు ఎగుమతి చేయనున్నారు. అలాగే అక్కడ తయారీ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి భారతీయ కంపెనీలను అనుమతి లభిస్తుందని సంబంధిత అధికారులు తెలిపారు.ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత, పశ్చిమాసియా దేశానికి తన ఎగుమతులను గణనీయంగా పెంచుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాలలో ఒమన్ భారత్‌కు మూడవ-అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా ఉంది, ద్వైపాక్షిక వాణిజ్యం ఎఫ్‌వై2019లో $5 బిలియన్ల నుంచి ఎఫ్‌వై2023లో $12.39 బిలియన్లకు పెరిగింది.