అమెజాన్ సేల్‌లో ఈ ఇయర్‌బడ్స్‌పై భారీ తగ్గింపులు!

by Harish |   ( Updated:2023-10-10 10:35:17.0  )
అమెజాన్ సేల్‌లో ఈ ఇయర్‌బడ్స్‌పై భారీ తగ్గింపులు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పలు రకాల ఉత్పత్తులను తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశం అందిస్తుంది. ముఖ్యంగా ఇయర్‌బడ్స్ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఎక్కువ ధర కలిగినటువంటి టాప్ బ్రాండ్స్‌కు చెందిన ఇయర్‌బడ్స్ ప్రస్తుతం తక్కువ ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. అయితే ఏఏ కంపెనీల ఇయర్‌బడ్స్ ప్రస్తుతం రూ.5000 లోపు ధరలో లభిస్తున్నాయో ఒకసారి చూద్దాం..

Realme Buds Air 5 Pro అమెజాన్ సేల్‌లో ప్రస్తుతం రూ.4,699 కే అందుబాటులో ఉంది. కొనుగోలు సమయంలో ఇంకా పలు క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది 50dB వరకు నాయిస్ క్యాన్సలేషన్‌ను అందిస్తుంది. సౌండ్ ఎఫెక్ట్ 360 డిగ్రీల వరకు వస్తుంది. ఈ ఇయర్‌బడ్స్ 40 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

OnePlus Buds Z2 ఇయర్‌బడ్స్ అసలు ధర రూ.5,999. కానీ ఈ సేల్‌లో రూ.3,999కే అందుబాటులో ఉంది. దీనిలో 11mm డైనమిక్ డ్రైవర్లను అందించారు. అలాగే 40dB వరకు నాయిస్ క్యాన్సలేషన్ కూడా ఉంది. ఈ తగ్గింపుతో పాటు పలు క్యాష్‌బ్యాక్‌లు సైతం లభిస్తాయి. ఇది 38 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

Samsung Galaxy Buds Live ఇయర్‌బడ్స్ రూ.4,299 కి అందుబాటులో ఉంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ టెక్నాలజీతో వచ్చాయి. 21 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ పేర్కొంటుంది. ఇది మైస్టిక్ బ్లాక్, బ్రోన్జ్ కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉన్నాయి.

JBL Tune 230NC ఇయర్‌బడ్స్ భారీ తగ్గింపుతో ఈ సేల్‌లో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.7,999. కానీ ఇది రూ.3,988 కే లభిస్తుంది. ఇవి ప్రత్యేకమైన బేస్‌ను అందిస్తాయని కంపెనీ పేర్కొంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ టెక్నాలజీతో 40 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తాయని కంపెనీ పేర్కొంటుంది. ఈ తగ్గింపుతో పాటు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై తగ్గింపులు కూడా ఉన్నాయి.

Advertisement

Next Story