- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆంధ్రప్రదేశ్‌లో హెటెరో గ్రూప్ రూ. 1,000 కోట్ల పెట్టుబడి
by Harish |
X
విశాఖపట్నం: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ హెటెరో గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. ఔషధ, స్పెషలిస్ట్ వ్యాపారాన్ని విస్తరించడానికి సుమారు రూ. 1,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ కృష్ణ బండి శనివారం తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో మాట్లాడిన ఆయన, కరోనా మహమ్మారి తరువాత ప్రపంచ దేశాలు ఫార్మాస్యూటికల్ రంగంలో భారత్‌ను అగ్రగామిగా భావిస్తున్నాయి. ఈ రంగంలో ఎగుమతులను పెంచడానికి భారత్‌కు చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి పర్యావరణ వ్యవస్థ కారణంగా ఇక్కడ ఫార్మా వ్యాపారాన్ని మరింత విస్తరించాలని చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో సుమారు రూ. 1,000 కోట్ల పెట్టుబడి పెట్టి, 3,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story