- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Savings Scheme: ప్రతి నెలా రూ. 5 వేలు పెట్టుబడి పెట్టండి.. లక్షలు సంపాదించండి.. పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్ ఇది!

దిశ,వెబ్‌డెస్క్: Post Ofice Savings Scheme: పోస్టాఫీస్ లో అనేక రకాల పొదుపు పథకాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందుతున్నారు. మీరు కూడా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లయితే..మీరు ఈ స్కీములో ఇన్వెస్ట్ చేసినట్లయితే..మంచి రాబడిని పొందవచ్చు. వాటిలో ఒకటి రికరింగ్ డిపాజిట్ స్కీము. ఇందులో ప్రతినెలా కొద్ది మొత్తంలో డిపాజిట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ పొందవచ్చు. ఇందులో ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు హామీతో కూడిన రాబడిని పొందుతారు. అందుకే గత కొంత కాలం నుంచి అనేక మంది పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీముల్లో పెట్టుబడి పెడుతున్నారు. వాటిలో ఒకటి రికరింగ్ డిపాజిట్ స్కీమ్. దీనిలో ప్రతినెలా కొద్ది మొత్తంలో డిపాజిట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ పొందవచ్చు.
ఇది సేఫ్ ఇన్వెస్ట్ స్కీమ్. ఆర్డి స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి 5ఏళ్లు. 5ఏళ్ల తర్వాత మీకు మెచ్యూర్ క్లోజ్ చేసుకోవడం ద్వారా వడ్డీతోపాటు మీ మొత్తం డబ్బును పొందవచ్చు. మీకు కావాలంటే మీరు దానిని తదుపరి 5ఏళ్లు కూడా పొడిగించుకోవచ్చు. ఈ స్కీములో 3ఏళ్ల తర్వాత కూడా అకాల మూసివేత సౌకర్యాన్ని అందిస్తున్నారు. పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్ వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం పెంచింది. మీరు ఈ స్కీములో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు 7.5శాతం వడ్డీ రేటు లభిస్తుంది. గతంలో ఇది 6.7శాతం ఉండేది. ఈ పొదుపు స్కీమ్ వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకోసారి ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
పోస్టాఫీస్ ఆర్డీ స్కీములో నెలకు రూ. 5వేలు పెట్టుబడి పెడితే మీరు ఎంత రాబడి పొందుతారో తెలుసుకుందాం. మీరు పోస్టాఫీస్ ఆర్డీ స్కీములో ప్రతి నెలా రూ. 5వేలు పెట్టుబడి పెట్టినట్లయితే 5ఏళ్ల పాటు రూ. 3లక్షలు జమ అవుతాయి. ఆ క్రమంలోనే మీరు రూ. 3లక్షల డిపాజిట్ మొత్తంపై 7.5శాతం వడ్డీ రేటుతో డబ్బును పొందినట్లయితే మీకు వడ్డీ రూ. 64,448జమ అవుతుంది. అదే విధంగా మెచ్యూరిటీ సమయం ఐదేళ్ల పూర్తయిన తర్వాత మీరు మొత్తం రూ. 3,64,448 జమ అవుతుంది. ఒకవేళ నెలకు వెయ్యి లేదా మూడు వేల రూపాయలు చెల్లిస్తే ఎంత మొత్తం వస్తుందో తెలుసుకుందాం.
పోస్ట్ ఆఫీస్ RD పథకం నెలవారీ వాయిదా
నెల డిపాజిట్ 5 ఏళ్లకు వడ్డీ వచ్చే మొత్తం
రూ. 1000 - రూ. 60,000 - రూ. 12,886 - రూ. 72,886
రూ. 3000 - రూ. 1,80,000 - రూ. 38,666 - రూ. 2,18,666
రూ. 5000 - రూ. 3,00,000 - రూ. 64,448 - రూ. 3,64,448
Read More..
Rapido: ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి ర్యాపిడో!.. జొమాటో, స్విగ్గీల ఆధిపత్యానికి చెక్?