బడ్జెట్ సెషన్‌లో బీమా చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

by S Gopi |
బడ్జెట్ సెషన్‌లో బీమా చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
X

దిశ, బిజినెస్ బ్యూరో: '2047 నాటికి అందరికీ బీమా' లక్ష్యం సాధించేందుకు రాబోయే బడ్జెట్ సెషన్‌లో బీమా చట్టం, 1938కి సవరణలు కోరుతూ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. సవరణ బిల్లులో భాగమైన కొన్ని నిబంధనలు, కాంపోజిట్ లైసెన్స్, డిఫరెన్షియల్ క్యాపిటల్, సాల్వెన్సీ నిబంధనల తగ్గింపు, క్యాప్టివ్ లైసెన్స్ జారీ చేయడం, పెట్టుబడి నిబంధనల మార్పు, మధ్యవర్తుల కోసం ఒకేసారి రిజిస్ట్రేషన్ చేయడం, ఇతర ఆర్థిక ఉత్పత్తులను కూడా పంపిణీ చేయడానికి బీమా సంస్థలను అనుమతించడం వంటివి ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి ఈ నెలాఖరులో జరిగే బడ్జెట్ సమావేశాల్లో సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న యూనివర్శల్, స్మాల్ ఫైనాన్స్, పేమెంట్ బ్యాంకుల తరహాలో బీమా చట్టంలోనూ మార్పుల వల్ల భిన్నమైన కంపెనీల ప్రవేశానికి అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రతిపాదించిన సవరణల ద్వారా పాలసీదారుల ప్రయోజనాలు, రాబడిని పెంచడంతో పాటు ఆర్థిక వృద్ధి, ఉద్యోగావకాశాలకు వీలుంటుందని భావిస్తున్నారు. కొత్త కంపెనీల రాకతో పోటీతత్వం పెరిగి పాలసీఉ తక్కువ ధరలకు లభిస్తాయని అంచనా.

Advertisement

Next Story