తులం బంగారం కేవలం 89 రూపాయలే..! రేట్ పెరిగిన వేళ ధరల పట్టిక వైరల్!!

by Indraja |
తులం బంగారం కేవలం 89 రూపాయలే..! రేట్ పెరిగిన వేళ ధరల పట్టిక వైరల్!!
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం ధరలు గడిచిన ఏడాదిలో గరిష్ఠ స్థాయిలో పెరిగాయి. 2023 డిసెంబర్ నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.58,270 ఉండగా.. 2024 ఏప్రిల్ మొదటి వారం ప్రారంభంలోనే రూ.71,290లకు చేరింది. అంటే కేవలం మూడు నెలల్లోనే రూ.13 వేల పై చిలుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి అంటే 1947వ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర కేవలం 89 రూపాయలు గరిష్ఠంగా నమోదైంది. మొదటిసారి 1980లో రూ.1333లకు చేరిన బంగారం ధర 2009 చివరి నాటికి రూ.7 వేలను మించలేదు. కానీ 2010 నుంచి ధరల సూచీ ఆకాశం వైపు పరుగులు తీసింది. 2005లో రూ.7 వేలు ఉన్న ధర 2010 నాటికి రూ.18,500లకు చేరింది.

ఇక 2015 పరుగులు మొదలు పెట్టిన పసిడి ధర రూ.26,345 నుంచి నేడు ఆల్ టైం లైఫ్ టైం రికార్డ్‌గా రూ.71 వేలను దాటింది. 2025 నాటికి తులం బంగారం రూ.80 వేల మార్కును దాటేలా ఉన్నదని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా గడిచిన తొమ్మిదేళ్లలో అంటే 2015 నుంచి 2024 ఏప్రిల్ మధ్య గోల్డ్ ధర అమాంతం రూ.45 వేలు పెరిగి రికార్డు సృష్టించింది. కానీ 2020-2021 మధ్య అతి స్వల్పంగా కేవలం రూ.70 మాత్రమే పెరిగింది. 2019లో కరోనా సమయంలో ప్రారంభమైన పసిడి పరుగు నేటికీ ఆగకుండా పరుగులు పెడుతూనే ఉంది.

Advertisement

Next Story