కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ తీసుకొచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా

by S Gopi |
కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ తీసుకొచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్తగా ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 'బాబ్ మాన్‌సూన్ ధమాకా డిపాజిట్ స్కీమ్' పేరుతో తెచ్చిన ఈ ఎఫ్‌డీ ద్వారా ఖాతాదారులు అధిక వడ్డీ ప్రయోజనాలు పొందవచ్చని బ్యాంకు చెబుతోంది. ఇదే సమయంలో బ్యాంకు తన సాధారణ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను కూడా సవరించింది. కొత్త ఎఫ్‌డీ పథకం వివరాలను చూస్తే.. ఇది రెండు కాలవ్యవధుల్లో ప్రారంభించారు. 399 రోజుల కాలపరిమితి కలిసిన ఎఫ్‌డీపై 7.25 శాతం వడ్డీని బ్యాకు ఆఫర్ చేస్తుండగా, 333 రోజుల డిపాజిట్‌లకు 7.15 శాతం వడ్డీని ఇస్తోంది. ఈ ప్రత్యేక ఎఫ్‌డీ పథకం జూలై 15 నుంచి ప్రారంభమవుతుందని, రూ. 3 కోట్ల కంటే తక్కువ రిటైల్ డిపాజిట్‌లకు ఇది వర్తిస్తుందని బ్యాంకు వివరించింది. సాధారణ ఖాతాదారుల కంటే సీనియర్ సిటిజన్‌లకు అదనంగా 0.50 శాతం ఎక్కువ వడ్డీ పొందవచ్చని బీఓబీ పేర్కొంది. ఇక, సాధారణ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లకు సంబంధించి రూ. 3 కోట్ల కంటే తక్కువ మొత్తం డిపాజిట్ చేసేవారికి 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలవ్యవధులపై 4.25 శాతం నుంచి 7.25 శాతం మధ్య వడ్డీని బ్యాంకు అందిస్తోంది.

Advertisement

Next Story