మోడీని కలవడానికి భారత్‌కు రానున్న ఎలాన్‌మస్క్: నివేదిక

by Harish |
మోడీని కలవడానికి భారత్‌కు రానున్న ఎలాన్‌మస్క్: నివేదిక
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెస్లా అధినేత ఎలాన్‌మస్క్, భారత ప్రధాని మోడీని కలవడానికి ఏప్రిల్ 22న దేశంలో పర్యటించే అవకాశం ఉందని ఒక నివేదిక పేర్కొంది. దేశంలో పెట్టుబడులు, కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి ప్రకటనలు చేసే అవకాశం ఉందని సమాచారం. సుమారు రూ.16 వేల కోట్ల($2 బిలియన్ల) పెట్టుబడితో భారత్‌లో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి టెస్లా ముందుకు వచ్చింది. అయితే దీని కోసం కొన్ని రాష్ట్రాల్లో అనువైన ప్రదేశాలను అధికారుల బృందం పరిశీలిస్తుంది. టెస్లా అధికారులుగుజరాత్, మహారాష్ట్రతో సహా వివిధ ప్రదేశాలను చూస్తున్నారు. వారికి మహారాష్ట్ర అనుకూలమైన ఎంపికగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడిన మస్క్, భారత్ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది. ఇతర దేశాల్లో ఎలక్ట్రిక్ కార్లు ఉన్నట్లే, భారత్‌లో కూడా ఈవీ వాహనాలు ఉండాలి. భారత్‌కు టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలను అందించడం సహజమైన పురోగతి అని ఆయన అన్నారు. ఇప్పుడు దీనికి అనుగుణంగా వేగంగా ఈవీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి మస్క్ పట్టుదలతో ఉన్నారు. చైనాలో దాని అమ్మకాలు తగ్గిపోవడంతో టెస్లా చూపు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న భారత్‌ వైపు పడింది. దేశంలో ప్లాంట్ ద్వారా ఇక్కడి వినియోగదారులకు ఈవీ కార్లను అందించడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 22న మస్క్, నరేంద్ర మోడీని కలుస్తారనే సమాచారంపై ప్రధాన మంత్రి కార్యాలయాన్ని, టెస్లాను సంప్రదించగా వారు దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీని గురించిన అధికారిక సమాచారం త్వరలో వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story