Trump: ట్రంప్ కాయిన్ రికార్డులు.. లాంచ్ అయిన గంటల్లోనే 7 బిలియన్ డాలర్ల విలువ

by S Gopi |
Trump: ట్రంప్ కాయిన్ రికార్డులు.. లాంచ్ అయిన గంటల్లోనే 7 బిలియన్ డాలర్ల విలువ
X

దిశ, బిజినెస్ బ్యూరో: క్రిప్టో కరెన్సీ మార్కెట్లో ట్రంప్ కాయిన్ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ ఎన్నికవడం, ప్రమాణస్వీకారం ఉన్న నేపథ్యంలో లాంచ్ అయిన కేవలం రెండు రోజుల్లో ఈ కాయిన్ అందరి దృష్టిని ఆకర్షించింది. కొన్ని గంటల్లో 300 శాతం పెరిగిన ట్రంప్ కాయిన్ 7.18 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో సంచలన సృష్టించింది. ట్రంప్ కాయిన్, ట్రంప్ మీమ్ కాయిన్‌గా పిలిచే ఈ కాయిన్ విలువ అమాంతం పెరగడంతో డిజిటల్ కరెన్సీ మార్కెట్లో దీనిపై అందరి దృష్టి పడింది. ఇతర డిజిటల్ కరెన్సీ తరహాలోనే ఈ ట్రంప్ మీమ్ కాయిన్స్ కూడా పనిచేస్తాయి. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే మీమ్స్ ఆధారంగా వీటిని లావాదేవీలకు, సెక్యులేటివ్ ట్రేడింగ్ కోసం ఉపయోగిస్తారు. తాజాగా ట్రంప్ మీమ్ కాయిన్ విడుదల చేసిన సమయంలో 33.87 డాలర్లుగా ఉంది. ఈ కాయింట్ విడుదల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. తన లీడర్‌షిప్‌కి సూచికగా ఈ ట్రంప్ కాయిన్ ఉంటుందన్నారు. ప్రధానంగా ట్రంప్ మీమ్ కాయిన్‌కు తక్కువ సమయంలో ఈ స్థాయిలో స్పందన రావడానికి.. 2024, జూలైలో తనపై జరిగిన హత్యాయత్నం గురించి ప్రస్తావించడం. ఈ కాయిన్ ప్రారంభించిన కొన్ని 24 గంటల్లోనే 0.18 డాలర్ల నుంచి 253.75 శాతం పెరిగి 22.94 డాలర్లకు పెరిగింది. ప్రస్తుతానికి 200 మిలియన్ల(20 కోట్ల) టోకెన్‌లను విడుదల చేసిన ట్రంప్.. వచ్చే మూడేళ్లలో 100 కోట్ల టోకెన్లను తీసుకురావాలని భావిస్తున్నట్టు చెప్పారు.

మీమ్ కాయిన్ గురించి..

ఇంటర్నెట్ ట్రెడింగ్‌గా ఆధారంగా పనిచేసే ఈ కాయిన్స్‌కు ఎలాంటి విలువ ఉండదు. ఇవి ఇంటర్నెట్ మీమ్స్ లేదా జోక్స్ నుంచి రూపొందించిన ఒక రకమైన క్రిప్టోకరెన్సీ. క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ లేదా ఏదైనా నిర్దిష్ట ప్రచారాన్ని లేదా ఒక కమ్యూనిటీని ప్రోత్సహించేందుకు సృష్టించారు. మీమ్ కాయిన్స్ ట్రేడింగ్‌లో ఎక్కువ అస్థిరత ఉంటుంది. వాటికి డిజిటల్ రూపంలో ఊహాజనిత విలువ ఉండటమే ఇందుకు కారణం.

Next Story

Most Viewed