- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొత్త ఈవీ పాలసీతో దేశీయ తయారీదారులపై ప్రభావం ఉండదు: DPIIT సెక్రటరీ
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఈవీ పాలసీ వలన దేశీయ తయారీదారులపై ఎలాంటి వ్యతిరేక ప్రభావం ఉండదని పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం(DPIIT) సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ అన్నారు. భారత్‌ను ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి గమ్యస్థానంగా మార్చడానికి కేంద్రం కొత్త EV పాలసీకి శుక్రవారం ఆమోదం తెలిపింది. అయితే దీనిలో దిగుమతి చేసుకున్న ఈవీ వాహనాలపై పన్ను రాయితీని అందించారు. ఈ నేపథ్యంలో దేశీయ ఈవీ తయారీదారులు తమ మార్కెట్ తీవ్రంగా దెబ్బతింటుందని, తమ అమ్మకాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని ఆందోళన పడుతున్న తరుణంలో తాజాగా ప్రభుత్వ ఉన్నతాధికారి మాట్లాడుతూ, కొత్తగా తీసుకొచ్చిన ఈవీ పాలసీ ద్వారా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ విస్తరిస్తుందని అన్నారు.
దీని వలన దేశీయ తయారీదారుల అమ్మకాలు ఏమాత్రం ప్రభావితం కావు. ఈ పాలసీపై సంబంధిత వాటాదారులందరి అభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకుంది, రాయితీలను మేము ఎవరి కోసం రూపొందించలేదు, చాలా పరిమిత సంఖ్యలోనే దిగుమతులకు అనుమతించాము. ఒక కంపెనీకి ఏడాదికి 8,000, అదే ఐదేళ్ల కాలానికి గరిష్టంగా 40,000 ఈవీ వాహనాలకు మాత్రమే అనుమతించాము, అది కూడా వాటిపై పూర్తి స్థాయిలో పన్ను తొలగించలేదని అన్నారు.