- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీ-సోనీ సరే.. రిలయన్స్-డిస్నీ స్టార్ పరిస్థితేంటి?
దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల జీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ గ్రూపునకు చెందిన ఇండియా విభాగం విలీన ఒప్పందం రద్దయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా రంగంలో మరో భారీ డీల్ డిస్నీ స్టార్, రిలయన్స్ మధ్య ఒప్పందంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ పరిణామం డిస్నీ విలువపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కోసం జీ ఎంటర్‌టైన్‌మెంట్ 1.5 బిలియన్ డాలర్ల విలువైన సబ్-లైసెన్సింగ్ ఒప్పందం చేసుకుంది. డిస్నీ స్టార్‌తో కలిసి జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఐసీసీ ఒప్పందం చేసుకుంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ తన ఒప్పందంలో సోనీతో విలీనం అయినప్పుడు మాత్రమే డిస్నీ స్టార్‌తో ఐసీసీ టెలివిజన్ ఒప్పందాన్ని గౌరవిస్తామని పేర్కొంది. డిస్నీ స్టార్ 2024 నుంచి 2027 వరకు దేశీయంగా ఐసీసీ టీవీ, డిజిటల్ హక్కులను 3 బిలియన్ డాలర్లకు ఈ కొనుగోలు చేసింది. సబ్-లైసెన్స్‌కు బదులుగా డిస్నీకి అవసరమైన బ్యాంక్ గ్యారెంటీని జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వలేదని సమాచారం. తాజా పరిణామాల మధ్య సోనీ-జీ వివాదంతో ఐసీసీ టీవీ డీల్ విషయంలో డిస్నీ స్టార్ వాల్యుయేషన్‌పై ప్రభావం పడుతుంది. ఈ వ్యవహారాన్ని రిలయన్స్ సంస్థ నిశితంగా పరిశీలిస్తోంది. డిస్నీ స్టార్ కోసం రిలయన్స్ సంస్థ రెండు వాల్యుయేషన్ ఔట్‌లుక్‌లను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఒకటి ఐసీసీ టీవీ హక్కులతో, మరొకటి ఆ హక్కులు లేకుండా. ఇటీవలే రిలయన్స్ డిస్నీ ఇండియా విలీనానికి వాల్ట్ డిస్నీతో నాన్-బైండింగ్ ఒప్పందంపై సంతకం చేసింది.
Read More..
రికార్డు స్థాయిలో 1,00,000 అమ్మకాలను దాటిన మారుతీ Fronx మోడల్