- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Investment: భారత్‌లో సింగపూర్ క్యాపిటాల్యాండ్ కంపెనీ రూ. 45,000 కోట్ల పెట్టుబడులు
దిశ, బిజినెస్ బ్యూరో: సింగపూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లోబల్ అసెట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ క్యాపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్(సీఎల్ఐ) భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు సిద్ధమవుతోంది. గత మూడు దశాబ్దాలుగా దేశీయంగా పెట్టుబడులను కలిగిన సీఎల్ఐ భారత్‌లో అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లో వచ్చే మూడేళ్లకు దాదాపు రూ. 45,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపింది. ముఖ్యంగా దేశంలో వేగంగా పెరుగుతున్న డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ హబ్‌ల విభాగాలను లక్ష్యంగా చేసుకుని 2028 నాటికి కంపెనీ దేశీయంగా తన నిర్వహణలో ఉన్న నిధుల విలువ(ఎఫ్‌యూఎం)ను రెట్టింపు చేయాలనే దానిపై దృష్టి సారించామని సీఐఎల్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. గత కొన్నేళ్ల నుంచి దేశంలో డేటా సెంటర్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో పాటు వేర్‌హౌసింగ్ వంటి కీలక విభాగాలపై పనిచేయాలని నిర్ణయించాం. దీనివల్ల ప్రస్తుతం 100 బిలియన్ డాలర్లతో ఎఫ్‌యూఎం కలిగిన సీఐఎల్ 2028 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని సీఐఎల్ గ్రూ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆండ్రూ లిమ్ పేర్కొన్నారు.