ATM కార్డులా ఆధార్ కార్డు.. ఏకంగా రూ.50 వేలు తీసుకోవచ్చునంట!

by Jakkula Samataha |
ATM కార్డులా ఆధార్ కార్డు.. ఏకంగా రూ.50 వేలు తీసుకోవచ్చునంట!
X

దిశ, ఫీచర్స్ : ఆధార్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్. ప్రస్తుతం ఏ చిన్న పని జరగాలన్నా సరే ఆధార్ అనేది తప్పనిసరి. ఆధార్ కార్డు లేకుండా ఏ పని కాదు. అందుకే ప్రతి ఒక్కరూ పర్స్‌లో ఆధార్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఆధార్ కార్డు అనేది ఏవైనా సర్టిఫికేట్స్ లేదా స్కీమ్స్ ఇలాంటి వాటికే యూస్ అవుతోంది అనుకుంటారు కానీ దానిని ఏటీఎమ్‌లా కూడా వాడొచ్చునంట. అదిఎలా అనుకుంటున్నారా? ఏటీఎం కార్డు మాదిరి మనం మన ఆధార్ కార్డును ఉపయోగించవచ్చునంట. బ్యాంకుకు వెళ్లకుండా ఏకంగా ఆధార్ కార్డుతో రూ.50 వేల నగదు తీసుకోవచ్చు అంటున్నారు. మరి అది ఎలా అనుకుంటున్నారా? ఇప్పుడే తెలుసుకుందాం. చాలా మందికి బ్యాంకులు అనేవి దూరంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా పల్లెటూర్లలో ప్రజలు బ్యాంకులకు వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే వారికోసమే ఈ ఏఈపీఎస్. దీనిని ఆధార్ ఎనెబుల్ పేమెంట్ సిస్టమ్.

దీని ద్వారా బ్యాంకుకు వెళ్లకుండా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఇలా మనీ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా బ్యాంకు అకౌంట్, ఆ వ్యక్తి ఫోన్ నెంబర్‌కు లింక్ అయ్యి ఉండాలి. దీని ద్వారా మీరు డబ్బులు తీసుకోవాలి. అయితే ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఇది కొనసాగుతోంది. దీని కోసం మీరు బ్యాంకుకు వెల్లకుండా.. ఆధానెంబర్ టైప్ చేసి , బయోమెట్రిక్ ఇవ్వాలి. దీంతో మీ డబ్బులు బ్యాంక్ మిత్రి అకౌంట్ లోకి వెళ్తాయి. వారు ఆ డబ్బును మీకు ఇస్తారు. అయితే ఇప్పటికీ పల్లెటూర్లలో ఉపాధి హామి పథకం డబ్బులు తీసుకునేవారు, పెన్షన్ తీసుకునేవారు ఈ పద్ధతిలోనే డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి

Advertisement

Next Story