- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైట్‌హ్యాట్ జూనియర్‌ను మూసేసే యోచనలో బైజూస్!
బెంగళూరు: ఇటీవలి నివేదికల ప్రకారం దేశీయంగా మిగిలిన వాటి కంటే ఎడ్‌టెక్ రంగం ఎక్కువ కష్టాలను ఎదుర్కొంటున్నదని తెలిపాయి. దాన్ని నిజం చేస్తూ తాజాగా ప్రముఖ ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్ కష్టాలను గట్టెక్కేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యే వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగులను తొలగించిన కంపెనీలు ఇప్పుడు తన అనుబంధ కోడింగ్ ప్లాట్‌ఫామ్ వైట్‌హ్యాట్ జూనియర్‌ను మూసేయాలని భావిస్తోంది.
దీనికి సంబంధించిన చర్చలు కూడా మొదలయ్యాయని, ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం నిర్ణయం ప్రకటించవచ్చని కొన్ని నివేదికలు వెల్లడించాయి. కరోనా మహమ్మారి సమయంలో అనూహ్యంగా పెరిగిన ఆన్‌లైన్ విద్యకు అనుగుణంగా 2020లో బైజూ సంస్థ వైట్‌హ్యాట్ జూనియర్‌ను సుమారు రూ. 2,500 కోట్లతో కొనుగోలు చేసింది. కరోనా తగ్గిన తర్వాత ఎడ్‌టెక్ రంగానికి గిరాకీ తగ్గడంతో నెమ్మదిగా ఆయా కంపెనీల్లో ఖర్చు తగ్గింపు చర్యలు మొదలుపెట్టాయి.
అందుకు అనుగుణంగా వైట్‌హ్యాట్ జూనియర్‌లో బైజూస్ 300 మంది ఉద్యోగులను తొలగించింది. ఇక, వర్క్ ఫ్రమ్ హోమ్ తొలగించి ఆఫీసులకు రావాలని చెప్పడంతో మరో 800 మంది ఉద్యోగాలను వదులుకున్నారు. ఇలా వరుస పరిణామాల్లో వైట్‌హ్యాట్ జూనియర్ వరుసగా నష్టాలను నమోదు చేస్తూ వచ్చింది. దీంతో ప్రస్తుతం నష్టాలను భరించడం కంటే మూసేయడం మంచిదని బైజూస్ భావిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.