- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BMW Z4 M40i : కొత్త మోడల్ కారును విడుదల చేసిన బీఎండబ్ల్యూ ఇండియా!
న్యూఢిల్లీ: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన సరికొత్త జెడ్4 ఎం40ఐ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇంతకుముందు ఉన్న అన్ని మోడల్ కార్ల కంటే మెరుగైన పనితీరు, డిజైన్‌తో ఈ కారును తీసుకొచ్చామని, దీని ధరను రూ. 89.30 లక్షలు(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది.
అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన ఈ కారు డెలివరీలను ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. కొత్త జెడ్4 రోడ్‌స్టర్‌లో 19 ఇంచెస్ అలాయ్ వీల్స్, ఫ్యాబ్రిక్ రూఫ్-టాప్, హెడ్‌ల్యాంప్ డిజైన్ మార్పులతో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.
అలాగే, నాలుగు ఎయిర్‌బ్యాగులు, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. అత్యాధునిక మార్పులతో తెచ్చిన ఈ కారు 8-స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కేవలం 4.5 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ వెల్లడించింది.