మార్కెట్లోకి సరికొత్త BMW ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జింగ్‌తో 516 కి.మీ

by Disha Web Desk 17 |
మార్కెట్లోకి సరికొత్త BMW ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జింగ్‌తో 516 కి.మీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ లగ్జరీ వాహనాల తయారీ కంపెనీ BMW ఇండియాలో కొత్తగా ఈవీ కారును విడుదల చేసింది. దీని పేరు i5 M60 xDrive ఎలక్ట్రిక్ సెడాన్‌. ప్రారంభ ధర రూ.1.20 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ మోడల్ స్పోర్టియర్ లుక్‌ను కలిగి ఉంది. 5 సరీస్‌లో ఈ మోడల్ అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉందని కంపెనీ పేర్కొంటుంది. ఇది 3.8 సెకన్లలో గంటకు 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. ఒక్కచార్జింగ్‌తో 516 కి.మీల దూరం ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. గరిష్టంగా 230 కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది.

కారు 593 BHP పవర్, 795 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో వస్తుంది. 83.9 kWh బ్యాటరీ ఇంజిన్‌కు శక్తినిస్తుంది. దీనిని ప్రామాణిక 11kW AC చార్జర్ ద్వారా చార్జ్ చేయవచ్చు. ఆన్‌బోర్డ్ చార్జర్‌తో 22kW వరకు చార్జ్ చేసే అవకాశం ఉంది. దాదాపు 10-80 శాతం చార్జింగ్ కేవలం 30 నిమిషాల్లో అవుతుందని కంపెనీ తెలిపింది.

కారు లోపల ఫ్రీ-స్టాండింగ్ డ్యూయల్ డిస్‌ప్లే, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌, పనోరమిక్ సన్‌రూఫ్, సరికొత్త ఆడియో సిస్టమ్ వంటివి ఉన్నాయి. LED హెడ్‌ల్యాంప్స్‌, క్రూయిజ్ కంట్రోల్, అటెన్టివ్‌నెస్ అసిస్టెంట్, స్మార్ట్‌ఫోన్, రివర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెషనల్ వంటి ఫీచర్లను కలిగి ఉన్న ADAS భద్రత ఫీచర్లను అందించారు. ప్రస్తుతం కారుకు సంబంధించిన బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.



Next Story

Most Viewed