World Laughter Day : సరదాగా నవ్వుకుందామా కాసేపు..

by Disha Web Desk 8 |
World Laughter Day : సరదాగా నవ్వుకుందామా కాసేపు..
X

దిశ, ఫీచర్స్ : చిరునవ్వులతో బతకాలి చిరంజీవిలా బతకాలి..అందరూ ప్రతి రోజు సంతోషంగా నవ్వుతూ ఉండండి. ఏంటీ ఈ రోజు నవ్వు గురించి చెప్తుంది అనుకుంటున్నారా..నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం అందుకే మీ పెదాలపై స్మైల్ తీసుకొద్దామని, నవ్వండి అని చెప్తున్నా..

నవ్వడం నాలుగు విధాల చేటు అనేవారు అప్పుడు.. కానీ ఇప్పుడు నవ్వడమే భోగం, యోగం, నవ్వుకపోవడేమో ఒక రోగం అంటున్నారు. ప్రతి రోజూ నవ్వడం వలన ఆరోగ్యంగా ఉండొచ్చు. నవ్వడం వలన మన శరీరంలో ఉండే రోగాలన్నీ మాయమై, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఎన్ని బాధలు ఉన్నా ఓ చిరునవ్వుతో చిన్న పలకరింపు దొరికితే చాలా ఆ ఆనందం మరో విధంగా ఉంటుంది. అందుకే నవ్వు గురించి ఎందరో కవులు, రచయితలు చాలా గొప్పగా వర్ణించారు. చాలా సినిమాల్లో కూడా నవ్వు గురించి ఎన్నో పాటలు పాడారు. నవ్వవయ్య బాబు.. నీ సొమ్మెం పోతుంది.. ఇలా చాలా సాంగ్సే ఉన్నాయి.

నవ్వడం వలన కలిగే ప్రయోజనాలు చూసేద్దాం

నవ్వుతూ బతికేవారి ఆయుప్రమాణాలు మెరుగవుతాయి.

కోపాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది.

నవ్వుతో కండరాలు రిలాక్స్ అవుతాయి.

నవ్వడం వలన శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది.

నవ్వడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

నవ్వుల దినోత్సవం

ప్రతి సంవత్సరం మే నెలలో తొలి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంటారు. ఇప్పుడు మన దేశంలో కూడా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఈ పండుగను జరుపుకుంటున్నారు.

మీ కోసంమే ఈ జోక్స్ నవ్వండి మరి..









నవ్వితే హ్యాప్పీ

నవ్వకపోతే బీపీ

నవ్వని వాడు పాపి

అందుకే నవ్వండి.. నవ్వించండి.. ప్రపంచ నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు




Next Story

Most Viewed