స్టార్ హీరోయిన్ లగ్జరీ లైఫ్.. కార్ల కలెక్షన్ చూస్తే మతిపోవాల్సిందే!

by sudharani |   ( Updated:2024-05-18 14:00:38.0  )
స్టార్ హీరోయిన్ లగ్జరీ లైఫ్.. కార్ల కలెక్షన్ చూస్తే మతిపోవాల్సిందే!
X

దిశ, సినిమా: బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న వారిలో దీపికా పదుకొణె ఒకరు. ‘ఓం శాంతి ఓం’ మూవీతో వెండితెరకు పరిచయమైన ఈమె.. అనతికాలంలోనే మంచి స్టార్‌డమ్‌‌ను సొంతం చేసుకుంది. ఇక స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో కూడా బిజీగా ఉంది. అయినప్పటికీ జోరు తగ్గని ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అంతే కాకుండా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న దీపిక.. ప్రజెంట్ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది.

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె.. కెరీర్ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందట. కానీ ప్రస్తుతం అత్యధికంగా రెమ్యునరేషన్‌లు వసూళ్లు చేస్తూ.. టోటల్ లైఫ్ స్టైలే మార్చేసింది ఈ బ్యూటీ. అంతే కాకుండా ఆమె ఉపయోగించే కార్ల కలెక్షన్లు చూస్తే షాకవ్వాల్సిందే. దీపికా యూస్ చేసే కార్లు.. ఆడి క్యూ7 – ధర రూ. 80 లక్షలు. మెర్సిడెస్ మేబ్యాక్ S500 – రూ. 2.40 కోట్లు. ఆడి A8 L- రూ. 1.20 కోట్లు. రేంజ్ రోవర్ వోక్ – రూ. 1.40 కోట్లు. మినీ కూపర్ కన్వర్టిబుల్ – రూ. 45 లక్షలు. Mercedes-Benz S-క్లాస్- రూ. 1.60 కోట్లు. ఆడి A8 L- రూ. 1.20 కోట్లు. ఆడి A6- రూ. 55 లక్షలు. BMW 5 సిరీస్- రూ. 60 లక్షలు. పోర్షే కయెన్- రూ. 1 కోటి. ఇలా దీపికా వాడే మొత్తం కార్ల కలెక్షన్ కలిపితే వాటి విలువ రూ. 10 కోట్లు. ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898ఏడీ’తో టాలీవుడ్ ఎంట్రీ ఆచ్చేందుకు సిద్ధంగా ఉంది దీపికా.

Advertisement

Next Story