- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ స్కీమ్ చూసి ప్రధాని మోడీ కళ్లు మండుతున్నయ్.. మంత్రి పొన్నం ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీకి, మెట్రోకు సంబంధం లేదని, రెండూ వేర్వేరు సెక్టార్‌లు అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యాలపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ఆయన శనివారం ఓ ప్రకటన ద్వారా కౌంటర్ ఇచ్చారు. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని మోడీ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయని, దానిలో భాగంగానే తెలంగాణలోనూ ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ప్రీ జర్నీకి అవకాశం ఇచ్చామన్నారు. దీన్ని మెట్రోకి ముడి పెడుతూ మోడీ రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్నాడని ఫైర్ అయ్యారు.
ఆర్టీసీ ప్రయాణానికి, మెట్రో జర్నీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరుగుతుందన్నారు. ఉచిత బస్సు సౌకర్యంలో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. అవసరమైతే ఇంకా రూట్లు పెంచి కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ పథకం తమ ప్రభుత్వానికి మంచి గుర్తింపు ఇచ్చిందని, మహిళల ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. బస్సుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. బీజేపీ నేతలు అడ్డగోలు రాజకీయాలు బంద్ పెట్టి, ప్రజల అవసరాలు, డెవలప్ మెంట్ పై ఫోకస్ పెడితే బెటర్ అంటూ మంత్రి పొన్నం హితవు పలికారు.