గంగ సప్తమి రోజున ఇలా పూజిస్తే.. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం..!

by Disha Web Desk 10 |
గంగ సప్తమి రోజున ఇలా పూజిస్తే.. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం..!
X

దిశ, ఫీచర్స్: హిందూ మతంలో గంగా సప్తమి అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటిగా చెబుతుంటారు. ఈ రోజున గంగా దేవిని ప్రత్యేక భక్తి శ్రద్దలతో పూజిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది వైశాఖ మాసంలో శుక్ల పక్షంలోని సప్తమి తిథి మే 13, 2024న సాయంత్రం 5:20 గంటలకు మొదలయ్యి మే 14, 2024 సాయంత్రం 6:49 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున గంగాదేవిని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

గంగా సప్తమిని గంగామాత పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో ఏడవ రోజున జరుగుతుంది. ఈ రోజున గంగామాత బ్రహ్మదేవుని కమండలం నుండి బయటకు వచ్చిందని నమ్ముతారు. హిందూమతంలో ఈ రోజుకి ప్రాముఖ్యత ఉంది. ఈ పూజా విధానం ఇక్కడ తెలుసుకుందాం.

1. ఈ రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర గంగానదిలో స్నానం చేయాలి.

2. గంగాదేవికి మాల సమర్పించి స్వీట్లను నైవేద్యంగా పెట్టాలి.

3. ఈ రోజున, పవిత్ర గంగానది ఒడ్డున జాతరలు నిర్వహిస్తారు.

4. గంగా సప్తమి నాడు గంగా సహస్రనామ స్తోత్రం, గాయత్రీ మంత్రాన్ని పఠించడం శుభప్రదంగా చెబుతుంటారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story

Most Viewed