ఐపీఎల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్రికెట్ ఫ్యాన్స్ సీరియస్ అవడంతో ఆల్మోస్ట్ సారీ చెప్పిన అనిల్ రావిపూడి!

by GSrikanth |
ఐపీఎల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్రికెట్ ఫ్యాన్స్ సీరియస్ అవడంతో ఆల్మోస్ట్ సారీ చెప్పిన అనిల్ రావిపూడి!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల హడావుడి.. మరోవైపు ఐపీఎల్ సీజన్‌తో దేశంలో సందడి వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో టాలీవుడ్ యువ దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమయ్యాయి. యంగ్ హీరో సత్యదేవ్ నటించిన ‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు డైరెక్టర్ అనిల్ రావిపూడి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ మ్యాచ్ చూడకపోతే కొంపలేమి మునిగిపోవు.. సాయంత్రం సమయాల్లో సినిమాలకు రండి. కావాలంటే ఐపీఎల్ స్కోర్స్‌ను ఆన్లైన్లో చూసుకోవచ్చు’ అన్నారు.

ఈ స్పీచ్‌ను చిత్రబృందం సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. అనిల్ రావిపూడిపై ఐపీఎల్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడ్డారు. ‘సినిమాలు చూడకపోతే కూడా కొంపలేమి మునిగిపోవు.. ఓటీటీలోకి వచ్చాక చూసుకుంటాం’ అని స్ట్రాంగ్ కౌంటర్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై అనిల్ వివరణ ఇచ్చారు. ‘నా మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఆ ఈవెంట్‌కు వెళ్లేముందు ఒక డిస్ట్రిబ్యూటర్‌ను కలిసాను. ఐపీఎల్ వల్ల సినిమాలు సరిగ్గా ఆడట్లేదు అని చెప్తే.. ఫ్లోలో అలా మాట్లాడాను. దయచేసి నన్ను తప్పుగా అర్ధం చేసుకోవద్దు. ఐపీఎల్ చూడండి.. ఇటు సినిమాలు చూడండి’ అని అన్నారు.

Advertisement

Next Story