- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Blinkit: బ్లింకిట్ కొత్త సేవలు..10 నిమిషాల్లోనే ల్యాప్టాప్స్, ప్రింటర్లు డెలివరీ

దిశ, వెబ్‌డెస్క్: క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్(Blinkit) కొన్ని రోజుల క్రితమే అంబులెన్స్ సేవ(Ambulance services)లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఫ్లాట్ ఫామ్ ద్వారా అంబులెన్స్ ను బుక్ చేసిన 10 నిమిషాల్లోనే పే సేవకు రెడీగా ఉంటుందని తెలిపింది. 10 నిమిషాల్లోనే కిరాణా సరుకులను డెలివరీ చేస్తున్న బ్లింకిట్ ఇప్పుడు తన ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ పోర్ట్ పోలియో(Electronics Gadgets Portfolio)ను మరింత విస్తరించింది. కేవలం 10 నిమిషాల్లోనే ల్యాప్ టాప్ (Laptop in 10 minutes)లు, మానిటర్లు(monitors), ప్రింటర్ల(printers) డెలివరీ సేవలను ప్రారంభించింది. ఎంపిక చేసిన నగరాల్లో మొదట ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విషయాన్ని బ్లింకిట్ కంపెనీ సీఈవో అల్బిందర్ దిండ్సా(CEO Albinder Dindsa) ఎక్స్ వేదికగా వెల్లడించారు.
హెచ్ పీ కంపెనీ ల్యాప్ టాప్స్, లెనోవా(Lenovo), జీబ్రానిక్స్(Zebronics), ఎంఎస్ఐ(MSI) నుంచి మానిటర్లు, కెనాన్, హెచ్ పీ నుంచి ప్రింటర్లను కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేయనున్నట్లు కంపెనీ సీఈవో సోషల్ మీడియా(Social media) వేదికగా తెలిపారు. ఢిల్లీ ఎన్సీఆర్ (Delhi NCR), పుణె(Pune), ముంబై(Mumbai), బెంగళూరు, కోల్ కతా, లఖ్ నవూ నగరాల్లో ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే మరిన్ని బ్రాండ్స్ కు చెందిన ప్రొడక్ట్స్ ను డెలివరీ చేయనున్నట్లు తెలిపారు. మినిట్స్ పేరుతో ప్లిప్ కార్ట్(Flipkart), బీబీన్యూ పేరిట బిగ్ బాస్కెట్(Big Baksket), ఎలక్ట్రానిక్స్ వస్తువులను నిమిషాల్లోనే డెలివరీ చేస్తోంది. ఈ నేపథ్యంలో బ్లింకిట్ కూడా ఈ సేవల్లోకి రావడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
బ్లింకిట్ ఈ వారంలోనే ప్రారంభించిన రెండో కొత్త సర్వీసు ఇది. అంతకుముందు సీఈవో అల్బిందర్ దిండ్సా భారీ ఆర్డర్ ప్లీట్(Bulk order pleat) ను ప్రకటించారు. ఇవన్నీ కూడా పెద్ద ఆర్డర్లను నిర్వహించేందుకు రూపొందించిన ఎలక్ట్రిక్ వెహికల్స్. ప్రస్తుతం ఢిల్లీ, గురగ్రామ్ లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఇతర నగరాల్లో ప్రారంభిస్తామంటూ ఆ వాహనాలకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. అటు 10 నిమిషాల్లోనే అంబులెన్స్ సర్వీసులు గురుగ్రామ్(Gurugram) లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. తొలి ఐదు అంబులెన్స్ సేవలు గురు గ్రామ్ లో రోడ్డెక్కాయి. ఈ సేవలను కూడా మరిన్ని ప్రాంతాలకు విస్తరించడంతోపాటు బ్లింకిట్ యాప్(Blinkit App) ద్వారా బేసిక్ లైఫ్ సపోర్ట్(Basic Life Support) ను మీరు బుక్ చేసుకోవచ్చని ధిండ్సా తెలిపారు.