- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Bitcoin: రికార్డ్.. లక్ష డాలర్లు దాటిన బిట్ కాయిన్ వాల్యూ..!

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(America)లో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. క్రిప్టో కరెన్సీ(Crypto Currency) రారాజు బిట్‌కాయిన్(Bitcoin) విలువ రోజు రోజుకి దూసుకుపోతుంది. గురువారం ట్రేడింగ్(Trading)లో ఫస్ట్ టైం 1,00,000 డాలర్లు దాటి రికార్డు సృష్టించింది. భవిష్యత్ లో బిట్‌కాయిన్ విలువ 1,20,000 డాలర్లకు చేరుకునే అవకాశాలున్నాయని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్(SEC) ఛైర్మన్ పాల్ అట్కిన్(Paul Atkin) తెలిపారు.
కాగా క్రిప్టో కరెన్సీల విషయంలో నిబంధనలు సడలిస్తానని ట్రంప్ ఎన్నికల ర్యాలీలో వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే బిట్ కాయిన్ వాల్యూ అమాంతంగా పెరుగుతోందని మార్కెట్ నిపుణులు విశ్లేస్తున్నారు. కాగా గత నాలుగు వారాల్లో దీని విలువ 45 శాతం పెరిగింది. అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ రోజున 69,374 డాలర్లుగా ఉన్న దీని విలువ ఇప్పుడు లక్ష డాలర్లు మార్క్ అందుకోవడం విశేషం. కాగా బిట్‌కాయిన్ వాల్యూ పెరగడంతో సెంట్రల్ బ్యాంకులు(Central Banks) ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రిప్టో కరెన్సీ విలువ ఇలానే పెరిగితే పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదముందని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.