- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Niharika: తనలోని మరో ప్రతిభను బయటపెట్టిన మెగా డాటర్.. కూర్చోనే అలా చేస్తూ నెటిజన్లను ఫిదా చేసిందిగా..?

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక (Mega Daughter Nehaarika) ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరిస్తోంది. మొదట్లో నటిగా రాణించింది. నాగ శైర్య (Naga Shourya) సరసన ఒక మనసు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద అంతగా ఆడలేదు. కానీ నిహారిక యాక్టింగ్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయని చెప్పుకోవచ్చు. తర్వాత నాన్న నాగబాబు(Naga Babu)తో కలిసి నాన్నకూచి వెబ్ సిరీస్‌లో కూడా నటించి.. ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
అవకాయ్, డెడ్ పిక్సెల్స్ (Dead pixels)వెబ్ సిరీస్‌ల్లో కూడా తన అద్భుతమైన నటనను కనబర్చింది. అంతేకాకుండా.. సూర్యాకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో కూడా అవకాశం కొట్టేసి.. నెటిజన్లను ఆకట్టుకుంది. ప్రస్తుతం నిర్మాతగా తన టాలెంట్ చూపిస్తోంది. నిర్మాతగా మొదటి మూవీగా కమిటీ కుర్రాళ్లు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అవ్వడంతో నిహారిక నిర్మాతగా మంచి పేరు సంపాదించుకుంది.
విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు సంపాదించుకుంది. ఇకపోతే మెగా డాటర్ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఏదో ఒక పోస్టుతో తరచూ అభిమానుల్ని అలరిస్తుంటుంది. తాజాగా నిహారిక నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. తనలోని మరో ప్రతిభను బయటపెట్టింది. కూర్చుని అదిరిపోయే నృత్యంతో మెగా ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది.
ఈ వీడియోకు నిహారిక.. ‘‘గంటల తరబడి విమర్శనాత్మకంగా ఆలోచించిన తర్వాత ఇలా అంటూ ఓ లవ్ సింబల్ జోడించింది. అలాగే @yogkisharan కి ధన్యవాదాలు తెలియజేసింది. నా అమ్మాయి @ambatibhargavi నృత్యంలో ఎలా పాడుతున్నారో చూడండి అంటూ రాసుకొచ్చింది’’. ప్రస్తుతం మెగా డాటర్ అదిరిపోయే నృత్యం జనాల్ని ఆకట్టుకుంటుంది.
Read More..