ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి జై బాపు ..జై భీమ్ : మైనంపల్లి హనుమంతరావు

by Aamani |
ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి జై బాపు ..జై భీమ్ :  మైనంపల్లి హనుమంతరావు
X

దిశ,నర్సాపూర్ : ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ సంవిధాన్ కార్యక్రమం తీసుకొచ్చారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో “జై బాపు - జై భీమ్ - జై సంవిధాన్ సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్,మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి నూతి శ్రీకాంత్ గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి మెట్టు సాయి కుమార్ నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి రాజి రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులను, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతలను అవమానిస్తోందని ఆరోపించారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తుల చేతుల్లో దేశాన్ని పెట్టాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని వారి చేతుల్లో దేశం వెళ్లితే మన బతుకులు భద్రంగా ఉంటాయా మీరే ఆలోచించలని కోరారు.

జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఆశయాలకు తగ్గట్టుగానే మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ విధానాలను రూపొందిస్తుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే విప్లవాత్మక కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందని, బీసి కుల గణన, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదం సామాజిక విప్లవం తీసుకు వస్తుందన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని క్షేత్ర స్థాయిలో బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు, శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు సుప్రభాత రావు, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, నాయకులు రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు అశోక్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed