- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏపీలో భారీగా క్యాన్సర్ అనుమానిత కేసులు.. సంఖ్య తెలిస్తే షాకే..?

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) అనపర్తి నియోజకవర్గం(Anaparthi Constituency) బలభద్రపురం(Balabhadrapuram)లో కేన్సర్ వ్యాధి(Cancer Disease) కలకలం రేపిన విషయం తెలిసిందే. గ్రామంలో దాదాపు 200 మంది కేన్సర్ అనుమనిత లక్షణాలు కనపించడంతో ప్రభుత్వం అప్రమత్తమంది. గ్రామంలో మెడికల్ శిబిరాలు ఏర్పాటు చేసింది. ప్రతి ఇంటికి వైద్యుల బృందాలను పంపి పరీక్షలు చేయిస్తోంది. కేన్సర్ కారకాలను తెలుసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో బలభద్రపురం క్యాన్సర్ కేసులపై మంత్రి సత్యకుమార్ యాదవ్(Minister Satyakumar Yadav) సమీక్ష నిర్వహించారు. బలభద్రంలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ 31 మెడికల్ బృందాలను బలభద్రపురం పంపినట్లు తెలిపారు. 10,800 మందిలో 8,530 మందికి స్క్రీనింగ్ చేశామన్నారు. ప్రస్తుతం 32 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి కాదన్నారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. ఏపీ వ్యాప్తంగా కోటి 92 లక్షల మందికి స్క్రీనింగ్ చేశామని చెప్పారు. 1,45,649 క్యాన్సర్ అనుమానిత కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. 10-15 శాతం మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.