- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సమస్యలకు నిలయంగా కేసముద్రం తహసీల్దార్ కార్యాలయం..

దిశ, కేసముద్రం: కేసముద్రం తాసిల్దార్ కార్యాలయంలో సమస్యలు కొలువు తీరుతున్నాయి. మండల పరిధిలోని సుమారు 29 గ్రామ పంచాయతీలు, 1 మున్సిపాలిటీ లో కలిపి సుమారుగా 55452 మంది జనాభా ఉన్నారు. ఆయా గ్రామాల నుంచి వివిధ అవసరాల కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే వారికి కనీసం త్రాగడానికి త్రాగునీరు, మౌలిక వసతులు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. తహసిల్దార్ కార్యాలయం ఆవరణలోనే ఆధార్ సెంటర్ ఉంది. కొత్త ఆధార్ కార్డు తీసుకునేవారు, ఆధార్ కార్డులో పేరు మార్పులు, వివిధ అవసరాల కొరకు కార్యాలయానికి వచ్చే ప్రజలు వేసవిలో మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్న నీటి యంత్రం పని చేయడం లేదు. వేసవి కావటంతో ఈ సమస్య మరీ తీవ్ర రూపం దాల్చింది.
ముఖ్యంగా కార్యాలయంలో కంప్యూటర్ల సమస్య తీవ్రంగా ఉంది. ఉన్న కొద్ది కంప్యూటర్ల తో పనులకు చాలా ఆలస్యం అవుతుంది. ఇంకా రెండు మండలాలకు ఒక్కరే తహసీల్దార్ కావడంతో అది వారికి తలకు మించిన భారం కావడంతో ప్రజా సమస్యలు కూడా పెండింగ్ లో పడే అవకాశాలు ఉన్నాయి.ఇంకా తహసీల్దార్ కార్యాలయం కూడా భవనం పూర్తిగా శిథిలా వ్యవస్థకు చేరుకుంది. సిబ్బంది విధులు నిర్వహించే గదిలో స్లాబ్ నుంచి పెద్ద పెద్ద పెచ్చులు విరిగి పడిపోతున్నాయి. దీంతో భయం భయంగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. గత పది సంవత్సరాల కాలం నుండి తహసిల్దార్ కార్యాలయానికి ఎటువంటి మరమ్మతులు నిర్వహించలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి తహసిల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని మరియు తక్కువ గా ఉన్న కంప్యూటర్లను సమకూర్చాలని పలువురు కోరుతున్నారు.