ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు ఇస్తే తప్పా...? : పిన్నింటి అనిల్ రావు

by Aamani |
ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు ఇస్తే తప్పా...? : పిన్నింటి అనిల్ రావు
X

దిశ, పర్వతగిరి : విద్యా వ్యవస్థను పెంచాలి, గుళ్ళు కడితే బిచ్చగాళ్ళు అవుతారు, బడులు కడితే విద్యావంతులు అవుతారని గతంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడిన సందర్భాన్ని వక్రీకరిస్తూ రాజకీయ రంగు పులిమి బీజేపీ నాయకులు ఎన్నో ఆరోపణలు చేశారని ప్రస్తుతం ఇఫ్తార్ విందు ఇచ్చిన కూడా అలాగే మత రాజకీయాలు చేస్తున్నారని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు అన్నారు. ఇకనైనా బీజేపీ పార్టీ హిందుత్వాన్ని అడ్డుపెట్టుకుని మత రాజకీయాలు కుల రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు మానుకోవాలని అనిల్ రావు హితవు పలికారు. ప్రజల్లో విశ్వాసముంటే నాయకుడిగా గెలిపిస్తారు మతాన్ని కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాల్సిన అవసరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు లేదని ఒక ఉన్నతమైన స్థాయిలో ఐపీఎస్ అధికారిగా ఎంతోమందికి కులాలను మతాలను చూడకుండా న్యాయం చేసిన వ్యక్తి అని అన్నారు.

గిరిజన కులస్తులు తీజ్ పండుగలు చేసుకుంటే పాల్గొన్నారని ముదిరాజులు పెద్దమ్మ గంగమ్మ పండుగలకు గౌడ కులస్తులకు కాటమయ్యలు క్రిస్మస్ పండుగ వస్తే ప్రతి ఒక్క చర్చికి రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు వ్యక్తిగతంగా ఆర్థికంగా శుభాకాంక్షలు ఇఫ్తార్ విందులను ఇస్తూ కుల మతాలకు అతీతంగా ఆదర్శంగా ఉండే వ్యక్తిని అగౌరవంగా మాట్లాడడం కించపరచడం సరికాదని అన్నారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఒక ఇఫ్తార్ విందు నైన ఏర్పాటు చేసిన సంఘటనలు ఉన్నాయని ప్రశ్నించారు. భారతదేశం మతాలకు సాంప్రదాయాలకు సంస్కృతికి పుట్టిన ఇల్లు లాంటిదని భిన్నత్వంలో ఏకత్వంగా సాంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగాల్సిన మనం ఇంకా మతాలను కులాలను రెచ్చగొడుతూ కుటిల రాజకీయాలకు పాల్పడుతూ మతాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించొద్దని అన్నారు.

ఇక ఓటర్ల విషయానికొస్తే మతాలను కులాలను రెచ్చగొట్టే పార్టీలను పక్కనపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజానీకం పట్టం కట్టారని అది గుర్తుతెరిగి మాట్లాడాలని ఓట్ల కోసం ఓటు బ్యాంకు కోసం మతాల మధ్య చిచ్చు పెట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి కానీ స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు గాని లేదని అన్నారు. ఇక స్థానిక ఎలక్షన్ల విషయానికొస్తే ఓటర్లు చైతన్యవంతులని హిందూ ముస్లిం క్రిస్టియన్ అంతా ఒక్కటే అని నిరూపిస్తారని బిజెపి దాని షాడో పార్టీ బీఆర్ఎస్ ఎన్ని నాటకాలు ఆడినా ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నగార మోగించడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed